ఆంధ్రుల
అందాల నటుడు, నట భూషణ శోభన్
బాబు జన్మదిన వజ్రోత్సవ వేడుకలు ఈ నెల 30వ
తేదీ శనివారం జరుగనున్నాయని ‘మా' అధ్యక్షుడు మురళీమోహన్
తెలిపారు. ఈ మేరకు బుధవారం
ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈకార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, రాశి మూవీస్ నరసింహరావు,
రేలంగి నరసింహారావు, సురేష్ కొండేటి, ఆర్ నారాయణ మూర్తి
తదితరులు పాల్గొన్నారు. మోహన్ బాబు అభిమానుల
సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శిల్పకళా
వేదికలో కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ...కళాకారులకు అభిమానులు దొరకడం అనేది ఎంతో అదృష్టం.
ఒక మనిషి జీవించి ఉన్నప్పుడు
అభిమానులు ఉండటం సహజం, కానీ
భౌతికంగా దూరం అయిన తర్వాత
కూడా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం ఎంతో గొప్ప విషయం
అన్నారు.
తమ్మారెడ్డి
భరద్వాజ మాట్లాడుతూ...వజ్రోత్సవ వేడుకల సందర్భంగా 75 మంది పేద టెక్నీషియన్స్,
కళాకారులకు రూ. 10వేల చొప్పున
నగదు అందించనున్నట్లు తెలిపారు. వారిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
తరుపున సెలక్ట్ చేసినట్లు భరద్వాజ చెప్పుకొచ్చారు. ఈ వేడుకకు మోహన్
బాబు తనయుడు హాజరవుతున్నట్లు సురేష్ కొండేటి తెలిపారు.
శోభన్
బాబు అసలు పేరు ఉప్పు
శోభనా చలపతిరావు. జనవరి 14, 1937న ఒక సామాన్య
రైతు కుటుంబంలో జన్మించాడు. కృష్ణా జిల్లా చిన నందిగామ ఇతని
స్వగ్రామం.. తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ
రావు. మైలవరం హైస్కూల్లో చదివేరోజుల్లో శోభన్ బాబు నాటకాల
పైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు
పొందాడు.
0 comments:
Post a Comment