నందమూరి
నటసింహం బాలయ్య తాను నటించిన ‘ఆదిత్య
369' సీక్వెల్‌లో నటించేందుకు సన్నాహాలు
చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ
చిత్రంరలో బాలయ్య సరసన అనుష్కను హీరోయిన్
గా ఎంపిక చేసినట్లు ఆ
మధ్య వార్తలు వినిపించాయి. మొదట ఈ చిత్రానికి
అనుష్కని కథానాయికగా తీసుకోవాలని చర్చలు జరిపారు, కానీ ఇప్పుడు ఈ
అవకాశాన్ని డిల్లీ అందాల భామ తాప్సీ
దక్కించుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం అనుష్క బిజీగా ఉన్నందువల్ల తన కాల్షీట్లు బాలయ్య
కోసం అందుబాటులో లేవని, అందువల్లే ఈ చిత్రం నుండి
తప్పుకున్నరనే వార్తలు వినిపిస్తున్నాయి.
బాలయ్య
నటించిన హిట్ చిత్రాల్లో ‘ఆదిత్య
369' ఒకటి. 1991లో విడుదలైన ఈచిత్రం
అప్పట్లో బాక్సాఫీసు వద్ద తన తడాఖా
చూపింది. ముఖ్యంగా ఈచిత్రంలో బాలయ్య పోషించిన శ్రీకృష్ణ దేవరాయల పాత్రకు మంచి పేరొచ్చింది. ఇప్పటికీ
ఆచిత్రం టీవీలో వస్తుందంటే ఆసక్తిగా చూసే వారు ఎందరో.
అంత అద్భుతంగా ఉంటుందా ఆ చిత్రం.
‘ఆదిత్య
999' పేరుతో రూపొందబోయే ఈ చిత్రానికి సింగితం
శ్రీనివాస రావు ఈచిత్రానికి దర్శకత్వం
వహించనున్నారు. కొండ కృష్ణం రాజు
సమర్పణలో వినోద్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయి.
ఈ సంవత్సరం ఆగస్టు నుంచి ఈచిత్రం రెగ్యులర్
షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం
బాలకృష్ణ ‘శ్రీమన్నారాయణ'చిత్రంలో నటిస్తున్నారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో
ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై బాలకృష్ణ కథానాయకుడిగా రవికుమార్ చావలి దర్శకత్వంలో ‘మిరపకాయ్'
నిర్మాత రమేష్ పుప్పాల ఈ
చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇసా చావ్లా హీరోయిన్లుగా
చేస్తున్నారు.
0 comments:
Post a Comment