ఇంటర్నెట్
విస్తృతం అయిన తర్వాత ఫేస్
బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్
సైట్ల ఆదరణ బాగా పెరింగింది.
వీటి ద్వారా ఒకరి విషయాలను ఒకరు
పంచుకోవడం ఇప్పుడో ట్రెండ్. సినిమా స్టార్స్, సెలబ్రిటీలు కూడా తమ విషయాలను
అభిమానులతో పంచుకోవడానికి ఫేస్ బుక్, ట్విట్టర్లను
విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే కొందరు ఆకతాయిలు
సెలబ్రిటీల పేరిట ఫేక్ అకౌంట్స్
సృష్టించి అభిమానులను గందరగోళ పరుస్తుంటారు. వీటి భారిన ఇప్పటికే
చాలా మంది స్టార్స్ పడ్డారు.
తాజాగా తమన్నా కూడా ఈ ఫేక్
అకౌంట్స్‌తో ఇబ్బంది ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్ంయలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పందిస్తూ.... తాను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో లేనని
మరోసారి స్పష్టం చేసింది. తన పేరుతో ఫేస్
బుక్, ట్విట్టర్లలో ఉన్న అకౌంట్లన్నీ ఫేక్
అకౌంట్లన్నీ స్పష్టం చేసింది. అవి తన ఒరిజినల్
అకౌంట్స్ అని నమ్మిఅభిమానులు మోస
పోవద్దనే ఉద్దేశ్యంతో తానే ఈ విషయాన్ని
క్లారిఫై చేస్తున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం
తాను పవన్ కళ్యాణ్‌తో
కలిసి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం
షూటింగులో పాల్గొంటున్నట్లు తమన్నా చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో తమన్నా
గంగ పాత్రలో కనిపించనుంది. పవర్ స్టార్ లాంటి
పెద్ద స్టార్ సరసన చేసే అవకాశం
తొలిసారి దక్కడంతో చాలా ఆనందంగా ఉంది
తమన్నా. తమన్నా ఈచిత్రంతో పాటు ప్రభాస్ సరసన
రెబెల్ చిత్రంలో నటిస్తోంది. త్వరలో ‘హిమ్మత్ వాలా'చిత్రం ద్వారా
బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతోంది.
0 comments:
Post a Comment