హైదరాబాద్
: బాలకృష్ణ, బాపు కాంబినేషన్ లోరూపొందిన
'శ్రీరామరాజ్యం' చిత్రాన్ని ఆంగ్లంలోకీ అనువదించబోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు సాగుతున్నాయనీ, ఆ వెర్షన్‌ని
విదేశాల్లో విడుదల చేసే ఆలోచన ఉందన్నారు
నిర్మాత యలమంచిలి సాయిబాబు. ఆయన తాజాగా మీడియాతో
మాట్లాడుతూ ఈ విషయం తెలియచేసారు.
నిర్మాత
యలమంచిలి సాయిబాబు మాట్లాడుతూ ''బాపు-రమణలు తీర్చిదిద్దిన
ఈ చిత్రాన్ని తెలుగులోనే కాదు అన్ని భాషల్లోకీ
తీసుకువెళ్లాలన్నది నా తపన. గత
నెలలో తమిళంలో విడుదల చేశాను. ఇటీవలే మలయాళంలోకి తీసుకెళ్లాం. ప్రస్తుతం హిందీకి సంబంధించిన అనువాద కార్యక్రమాలు నడుస్తున్నాయి. హిందీలో పౌరాణిక చిత్రాలు, ధారావాహికలకు రచనలు చేయడంలో అనుభవజ్ఞుడైన
రచయిత దర్శన్‌లాడ్. ఆయన మా సినిమాకు
సంభాషణలు రాస్తున్నారు'' అన్నారు.
ఉత్తర
రామాయణాన్ని వెండి తెరపై 'శ్రీరామరాజ్యం'గా ఆవిష్కరించారు దర్శకులు
బాపు. కోదండరాముడిగా బాలకృష్ణ, సీతగా నయనతారల నటన
తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. త్వరలో ఈ సినిమా హిందీలోకి
అనువాదమవుతోంది. దసరాకి ఉత్తరాదిన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దసరా రోజున కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తారు.
శ్రీరాముడిగా
బాలకృష్ణ, సీతగా నయనతార, వాల్మీకి
మహర్షిగా అక్కినేని నాగేశ్వరరావు, భూదేవిగా రోజా, సుమిత్రగా కె
ఆర్ విజయ, లక్ష్మణుడిగా శ్రీకాంత్
నటించారు. ఈ చిత్రానికి ఇళయరాజా
రసవత్తరమైన సంగీతం, బాపు దర్శకత్వ ప్రతిభ
శ్రీరామరాజ్యంను ఒక అద్భుత కళా
ఖండంగా తీర్చిదిద్దారని ప్రశంసలు వచ్చాయి. పురాణ ఇతిహాసాలతో తెరకెక్కిన
చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని నిర్మాతలు భావించి ఈ చిత్రాన్ని అన్ని
చోట్ల రిలీజ్ చేస్తున్నామంటున్నారు.
0 comments:
Post a Comment