శ్రావ్యమైన
సంగీతానికి మారుపేరు ఎం.ఎం.కీరవాణి.
రాగాల్లో కీరవాణి రాగం ప్రశస్తమైనది. ఆ
పేరును పెట్టుకుని సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్న
కీరవాణి పుట్టిన రోజు నేడు. కీరవాణి
1961వ సంవత్సరంలో జూలై 4వ తేదీన
జన్మించారు. 1987వ సంవత్సరంలో తెలుగు
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి
దగ్గర అసిస్టెంట్ గా కీరవాణి కెరీర్ని
మొదలుపెట్టారు. ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ ఉషా కిరణ్
మూవీస్ వారు 1989లో నిర్మించిన మనసు
- మమత తెలుగు చిత్రం ద్వారా ఎం. ఎం. కీరవాణి
తెరనామంతో సంగీత దర్శకునిగా వెండి
తెరకు పరిచయమయ్యాడు. ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కి
కీరవాణి అన్నయ్య వరుస.
ఎస్.రాజేశ్వరరావు, కె.వి.మహదేవన్
వంటి ఉద్ధండుల నిష్క్రమణానంతరం నేటి తరం తెలుగు
సంగీత దర్శకులలో సంగీత ప్రధాన చిత్రాలకు
సంగీతం సమకూర్చగల ఒకే ఒకనిగా పేరొందాడు.
ఇప్పటి వరకూ కీరవాణి గారు
విభిన్న భాషల్లో 200 పైగా చిత్రాలకు సంగీతాన్ని
అందించి ప్రేక్షకుల్ని అలరించారు. 1997 లో వచ్చిన అన్నమయ్య
చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ
సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు. అలాగే ఇప్పటివరకూ ఈయన
8 నంది అవార్డులు గెలుచుకున్నారు.
కీరవాణి
సంగీతం సమకూర్చిన సినిమాలలో చెప్పుకోదగినవి సీతారామయ్యగారి మనవరాలు, క్షణ క్షణం, అల్లరి
మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి
ప్రియుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, నేనున్నాను, స్టూడెంట్ నంబర్ 1, ఛత్రపతి, సింహాద్రి, అనుకోకుండా ఒక రోజు, ఆపద్బాంధవుడు,
శుభ సంకల్పం, పెళ్లి సందడి మరియు సుందరకాండ.
కీరవాణి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకుని తెలుగువారికి మరిన్ని వీనులవిందైన స్వరాలు అందించాలని ఆశిస్తూ....వన్ ఇండియా తరుపున
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదాం.
0 comments:
Post a Comment