న్యూఢిల్లీ:
'తోటకూర దొంగిలించిననాడే ఆపొచ్చు కదా! రూ.కోట్లకు
కోట్లు తెస్తుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ
రాజభవనాలు ఎలా కడుతున్నావని ఏనాడైనా
అడిగావా?' అంటూ వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ గౌరవాధ్యక్షురాలు, వైయస్ జగన్ తల్లి
విజయలక్ష్మిని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు
ప్రశ్నించారు.
ఏ కష్టం చేయకుండా వేల
కోట్లు తెస్తుంటే.. ఏంచేసి తెస్తున్నావని తల్లి ప్రశ్నించటం సహజమని
ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అయితే, వైయస్ జగన్‌ను
విజయలక్ష్మి అలా అడగలేదని ఆయన
అన్నారు. నీతి, నిజాయతీ ఉంటే
జగన్ ఆస్తులన్నింటినీ ప్రజలకు పంచిపెట్టి, తర్వాతే కొడుక్కు న్యాయం చేయాలని విజయమ్మ కోరాలని ఆయన అన్నారు.
వైయస్
రాజశేఖర రెడ్డితోపాటే తానూ రాజకీయాల్లో ఉన్నానని,
తనవద్ద గానీ, సీఎంలుగా పనిచేసిన
ఇతరుల కొడుకుల వద్దగానీ జగన్‌కు ఉన్నన్ని
ఆస్తులున్నాయా? అని ప్రశ్నించారు. జగన్‌పై నార్కో అనాలసిస్
పరీక్షకు సీబీఐ నిర్ణయం సరైనదేనని
సమర్థించారు. ఓదార్పు యాత్రలో వెన్నంటి నడిచిన అనుచరుడు మంగలి కృష్ణ ఎవరో
తెలియదన్నాడని, వ్యాపార భాగస్వామి గాలి జనార్దనరెడ్డితో సంబంధం
లేదన్నాడని గుర్తుచేశారు.
కాబట్టి
నార్కో పరీక్ష ఒక్కటే పరిష్కారమని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో మేధో మథనం
జరపకుండా నాయకులకు పదవులివ్వటం మంచిది కాదని ఆయన సూచించారు.
ఈ మేరకు పార్టీ రాష్ట్ర
వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్‌కు లేఖ రాశానని
తెలిపారు. కార్యకర్తల మనోభావాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడానికి మేధో మథనం జరగాలని
ఆయన అన్నారు.
0 comments:
Post a Comment