విజయవాడ:
కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ సమావేశం రసాభాసగా మారింది. శాసనసభ్యుడు కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి జై కొట్టడంతో ఎంపీ
కొణకళ్ల నారాయణ ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గం టిడిపి నేతలు సమావేశమయ్యారు. ఈ
సమావేశం వద్దకు కొడాలి నాని వర్గీయులు రావడంతో
పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కొడాలి
నాని పార్టీని వీడిన నేపథ్యంలో కొణకళ్ల
గుడివాడ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం వద్దకు
పలువురు నాని వర్గీయులు వచ్చారు.
నానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టిడిపికి
వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అర్జునుడు మాట్లాడుతుండగా నాని వర్గానికి చెందిన
ఓ కార్యకర్త అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం
చేసిన కొణకళ్ల వర్గీయులు అతనిని బయటకు గెంటివేశారు.
సమావేశం
హాలు బయట ఆందోళన చేస్తున్న
పలువురు నాని వర్గీయులను పోలీసులు
అంతకముందే బలవంతంగా అక్కడి నుండి పంపించి వేశారు.
ఈ సందర్భంగా కొణకళ్ల మాట్లాడారు. నాని ఎన్ని కోట్ల
రూపాయలకు జగన్‌కు అమ్ముడు
పోయారో చెప్పాలని ప్రశ్నించారు. నాని ఓ కలుపు
మొక్క అన్నారు. నాని లాంటి చిట్టెలుకలు
ఎంతమంది పార్టీని వీడినా వచ్చే నష్టమేమీ లేదన్నారు.
నాని
తీరు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆత్మ
క్షోభిస్తుందన్నారు. నానికి రెండుసార్లు టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే గౌరవాన్ని
నిలుపుకోలేక పోయారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గుడివాడలో తెలుగుదేశం పార్టీదే గెలుపు అని చెప్పారు. నాని
బయటకు పోవడం వల్ల పార్టీకి
ఎలాంటి నష్టం లేదన్నారు.
0 comments:
Post a Comment