హైదరాబాద్:
అల్లరి నరేష్ తాజా చిత్రం
'సుడిగాడు' పూర్తిగా స్పూఫ్ లో వస్తున్ సంగతి
తెలిసిందే. 'ఒకే టిక్కెట్‌పై
100 సినిమాలు' అని ట్యాగ్ లైన్
తో వస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ
పైనా స్పూఫ్ పెట్టారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఆ
మధ్యన వచ్చి ఫ్లాఫ్ అయిన
బాలకృష్ణ సినిమా పలనాటి బ్రహ్మనాయుడులోని ..బాలకృష్ణ..ట్రైన్ ఆపే సన్నివేసాన్ని అల్లరి
నరేష్ పై తీసినట్లు చెప్పుకుంటున్నారు.
అది ధియోటర్లలో బాగా పండుతుందని,ఆ
సీన్ కి ఖర్చు ఎక్కువైనా
తీసారని వినపడుతోంది. మరి బాలయ్య అబిమానులు
ఈ స్ఫూఫ్ ని ఎంజాయ్ చేస్తారో
లేదో చూడలంటున్నారు.
అలాగే
ఈ చిత్రంలో రాజమౌళి తాజా హిట్ ఈగ
స్పూఫ్ ని పెడుతున్నారు. ఈగ
మాదిరిగానే సుడిగాడు లో కూడా మొదట
డైరక్టర్ వాయిస్ తో మొదలవుతుంది. ఈగలో
దర్శకుడు రాజమౌళి..కూతురుకి కథ చెప్తున్నట్లుగా పెట్టినట్లుగానే
ఇందులో బీమినేని శ్రీనివాసరావు..తన కూతురు కథ
చెప్పమని అడిగితే ..తెలుగు హీరో కథ చెప్తానని,వాడిపేరు సుడిగాడు అని మొదలెడతారు. ఇలా
సినిమా మొదటనుంచే స్ఫూఫ్ తో మొదలెడుతున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మక చిత్రాల్లో ఇదొక వైవిధ్యమైన ప్రయత్నం.
విజయవంతమైన చిత్రాల్లోని పలు సన్నివేశాల పేరడీతో
కథ సాగుతుంది. ప్రతి సన్నివేశం కూడా
ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్విస్తుంది. ఇటీవలే కథానాయకుడిపై పరిచయ గీతాన్ని తెరకెక్కించాం.
అసలు ఈ కథలో సుడిగాడు
ఎవరు? అతని కథేమిటన్నది తెరపైనే
చూడాలి. ఇందులో నరేష్ నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది''అన్నారు. అల్లరి నరేష్ కెరీర్ లో
ఈ చిత్రం మరో మైలు రాయిగా
నిలిచే అవకాశం ఉందంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత
భీమినేని డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం పై
మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక ఈ చిత్రంలో అల్లరి
నరేష్ హిట్ చిత్రాల పేరడీ
చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్
గజ్జర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ
చిత్రానికి చంద్రశేఖర్.డి.రెడ్డి నిర్మాత.
మోనాల్ గజ్జల్ ఇప్పటికే వెన్నెల వన్ అండ్ హాఫ్
చిత్రంలో చేసింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్
పూర్తయింది. వచ్చే నెలలో చిత్రం
విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఆడియో లాంచ్ అయి
మంచి క్రేజ్ తెచ్చుకుంది. చంద్రమోహన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ,
చలపతిరావు, కోవై సరళ, హేమ
తదితరులు ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్
నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్, ఛాయాగ్రహణం: విజయ్ ఉలగనాథ్.
0 comments:
Post a Comment