హైదరాబాద్: జూలై
29న జరిగిన ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
ప్యానల్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే . విజయం సాధించిన కౌన్సిల్ మరియు సెక్టార్
అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులలో కొందరు దర్శకరత్న డా. దాసరి నారాయణరావును
ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
గెలిచిన
వారిని అభినందించిన దాసరి మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్
చలన చిత్ర వాణిజ్య మండలిలో
జరిగిన ఎన్నికల్లో విజయాన్ని సాధించిన కౌన్సిల్, సెక్టార్ అధ్యక్షులు, నూతన కార్యవర్గ సభ్యులందరూ
ఉత్సాహవంతులని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆధిపత్యం ఉన్న
ఛాంబర్లో ఇప్పుడు కొత్త కార్యవర్గం వచ్చింది.
అందరికీ నా సహకారం ఎప్పుడూ
ఉంటుందన్నారు. ఛాంబర్ తరుపున చేసే ప్రతి మంచి
పనికి తన ప్రోత్సాహం ఉంటుందన్నారు.
సమస్యల
పరిష్కారంలో ప్రభుత్వాన్ని కలిసే సందర్భంలో ముందుండి
నడిపిస్తానని హామీ ఇచ్చారు. నూతన
కార్యవర్గానికి పరిశ్రమ తోడ్పాటు ఉండాలి. అలాగే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్ల
సహకారమూ ఉండాలి. ఏది ఏమైనా అటు
పరిశ్రమ ఇటు కార్యవర్గం ఇచ్చిపుచ్చుకునే
ధోరణిలో వ్యవహరించాలని చెప్పారు.
0 comments:
Post a Comment