వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రెహ్మాన్ గురువారం చంచల్‌గూడ జైలు వద్ద హంగామా చేశారు. అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలులో ఉన్న తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు రెహ్మాన్ తన అనుచరులతో కలిసి చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చారు. అయితే అతనికి జగన్‌ను కలిసేందుకు అధికారులు అనుమతివ్వలేదు. దీంతో అతను గేటు దగ్గరే చాలాసేపు ఉండిపోయారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్‌కు బెయిల్ ఇవ్వకుండా కాంగ్రెసు ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. త్వరలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలతో కలిసి వచ్చి జైలు గోడలు పగులగొట్టి జగన్‌ను బయటకు తీసుకు వెళ్తానని అన్నారు. కాగా రెహ్మాన్ బయట ఉన్నాడని తెలిసిన మీర్ చౌక్ ఎసిపి కిష్టయ్య అక్కడకు చేరుకొని జైలు అధికారులను సంప్రదించారు.
రెహ్మాన్‌కు అనుమతి ఇవ్వలేమని వారు చెప్పగా అదే విషయాన్ని బయటకు వచ్చి ఆయన రెహ్మాన్‌కు చెప్పా రు. దీంతో రెహ్మాన్ ఎసిపితో వాగ్వాదానికి దిగారు. ఎసిపి సర్దిచెప్పడంతో చివరికి శాంతించారు. ములాఖత్‌ల నిరాకరణ విషయాన్ని జైలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని, అనుమతి ఇవ్వకపోతే జైలు ముందు బైఠాయిస్తానని రెహ్మాన్ హెచ్చరించారు.

0 comments:
Post a Comment