హైదరాబాద్:
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి
హయాంలో ఓ వెలుగు వెలిగిన
ప్రస్తుత కాంగ్రెసు ముఖ్య నేత, రాజ్యసభ
సభ్యుడు కెవిపి రామచంద్ర రావు వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి జై కొడతారా అంటే
అవుననే అంటున్నారు కాంగ్రెసు నేతలు. కెవిపిపై పలువురు నేతలు తొలి నుండి
అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాంగ్రెసు పార్టీలో
ఉన్నప్పటికీ ఎప్పటికైనా హ్యాండిచ్చి జగన్ వైపు వెళతారని
పలువురు తొలి నుండి చెబుతూ
వస్తున్నారు.
మంగళవారం
ఆయన వైయస్ ఫోటో లేదంటూ
చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
దీంతో కొన్నాళ్లు ఆయనపై సైలెంట్‌గా
ఉన్న నేతలు సహా పలువురు
ఇతర నేతలు కూడా కెవిపిపై
తీవ్రస్థాయిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా విరుచుకు పడ్డారు. ఆయన ఖచ్చితంగా జగన్
కోవర్టేనని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు మధు యాష్కీ వంటి
నేతలు బల్ల గుద్ది మరీ
చెబుతున్నారు.
ఆయన ఎప్పటికైనా జగన్ పార్టీలో చేరతారని
చెబుతున్నారు. సిబిఐ జెడి కాల్
లిస్టు వ్యవహారంలో కూడా ఆయన పాత్ర
ఉందని ఆరోపించారు. జగన్ ఆస్తుల కేసులో
త్వరలో ఆయన అరెస్టు జరుగుతుందని,
దీని నుండి తప్పించుకునేందుకే ఆయన
ఈ తరహా బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారన్నారు. పిసిసి నేత
నిరంజన్ కూడా కెవిపిని కోవర్టుగా
అభివర్ణించారు. పిసిసి అధికార ప్రతినిధి తులసి రెడ్డి, డిప్యూటీ
సిఎం తులసి రెడ్డిలు కెవిపి
వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెవిపి
కోవర్టని చెబుతున్న నేతలు ఆయనపై ప్రశ్నల
వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెసును, తమ పార్టీ అధ్యక్షురాలు
సోనియా గాంధీని జగన్ విమర్శించినప్పుడు మాట్లాడని
కెవిపి కేవలం వైయస్ ఫోటో
లేకపోవడం అనే అంశాన్ని ఇంతగా
రాధ్దాంతం చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఆయన చెప్పినట్లుగా గాంధీ
భవనంలో ఇతర ముఖ్యమంత్రుల ఫోటోలు
ఉంటే వైయస్ ఫోటో కూడా
పెట్టే వాళ్లమని, ఇతర నేతల ఫోటోలు
లేవని తెలిసి వైయస్ ఫోటో అంశాన్ని
ఎందుకు తీసుకు వచ్చారని అంటున్నారు.
యువజన
కాంగ్రెసు కార్యక్రమం కాబట్టి అక్కడ అంతా యువకులు
ఉంటారని.. వారిని రెచ్చగొట్టేందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు
చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ సున్నిత అంశాన్ని
ప్రస్తావించి కాంగ్రెసులో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే
కాంగ్రెసుకు లబ్ధి చేకూర్చేలా లేవని
నష్టం చేకూర్చేవిగా ఉన్నాయని చెబుతున్నారు.
ఓ వైపు వైయస్ ఫోటో,
ఆయన పేరును ఉపయోగించుకోవాలా వద్దా అనే చర్చ
పార్టీలో జరుగుతుండగానే కెవిపి మరో అంశాన్ని లేవనెత్తడం
పట్ల వారు ఆగ్రహం వ్యక్తం
చేస్తున్నారు. కెవిపి వ్యవహార శైలిపై మరికొందరు నేతలు అనుమానం వ్యక్తం
చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి వైయస్
వివేకానంద రెడ్డి తరహాలో ఆయన కూడా జగన్
పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధపడే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు.
వైయస్ వివేకా తన సోదరుడిని విమర్శిస్తున్నారని,
దానిని తట్టుకోలేక తాను కాంగ్రెసును వీడుతున్నట్లు
చెప్పారు.
వైయస్
ఆత్మ బంధువుగా పేరుబడ్డ కెవిపి కూడా వైయస్‌కు
ప్రాధాన్యత లేదనే పేరుతో క్రమంగా
పార్టీకి హ్యాండ్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
ఆయన మంగళవారం చేసిన వ్యాఖ్యలు జగన్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయని
చెబుతున్నారు. అయితే మరికొందరు నేతలు
మాత్రం కెవిపి వ్యాఖ్యలను అంతగా రాద్దాంతం చేయాల్సిన
అవసరం లేదని అంటున్నారు.
0 comments:
Post a Comment