మద్దెలచెర్వు
సూరి హత్య కేసులో అరెస్టయిన
భాను కిరణ్ వల్ల వైయస్సార్
కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి
చిక్కులో పడతారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
భాను సంపాదించిన 800 కోట్ల రూపాయల ఆస్తుల
వెనక ఎవరి హస్తం ఉందనే
విషయంపై సిఐడి అధికారులు ఆరా
తీస్తున్నట్లు తెలుస్తోంది. తనకు మంగళి కృష్ణ
బినామీగా వ్యవహరించినట్లు భాను సిఐడి అధికారుల
వద్ద అంగీకరించినట్లు ఓ వార్తా పత్రిక
రాసింది.
మంగళి
కృష్ణ, అతడి కుటుంబ సభ్యులు
ఆదినుంచీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరవిధేయులు. కృష్ణ వైయస్ జగన్కు దాదాపు కుడిభుజంగా
పనిచేస్తున్నాడు. మంగళి కృష్ణ భానుకు
బినామీ కావడంతో వ్యవహారం ఇటూ అటూ తిరిగి
జగన్ దాకా వచ్చే ప్రమాదం
ఉందని అంటున్నారు. శనివారం నాడు భానును అరెస్ట్
చేసిన తరువాత తమ వద్ద ఉన్న
కొద్దిపాటి సమయంలో చేసిన విచారణలో భాను
చెప్పిన అంశాలపైనే నేరాంగీకార పత్రాన్ని రూపొందించారు. తాజాగా అతడిని కస్టడీలోకి తీసుకున్న అనంతరం మంగళికృష్ణ సంగతి కూడా పూర్తిగా
విచారిస్తామని సిఐడి అధికారులు చెప్పారు.
ఈ కేసులో మంగళి కృష్ణను కూడా
అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నామని
సిఐడి వర్గాలు అంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే అనేక వివాదాలు, కోర్టు
కేసులు, రాజ కీయవత్తిడుల మధ్య
తలమునకలై ఉన్న జగన్‌కు
తనకు అత్యంత సన్నిహితుడైన మంగళికృష్ణ ద్వారా వివాదం తలకు చుట్టుకోబోతున్నట్లు అనుమానిస్తున్నారు. ఏమైనా, జాతకాలు
బాగా లేనప్పుడు ఏది ఎప్పుడు మీద
పడుతుందో చెప్పలేం.
గతంలో
కూడా వైయస్ జగన్కు
మంగళి కృష్ణకు ఉన్న సంబంధంపై వివాదం
చెలరేగింది. పరిటాల రవి హత్య కేసు
వివాదంలో ప్రధానంగా ఆ వివాదం ముందుకు
వచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్ జగన్పై
తీవ్రమైన ఆరోపణలు చేశారు.
0 comments:
Post a Comment