Showing posts with label Chandra Babu Naidu. Show all posts
Showing posts with label Chandra Babu Naidu. Show all posts

Monday, December 24, 2012

Modi invites TDP president Chandrababu Naidu and Balakrishna

Former Gujarat Chief Minister Narendra Modi, who is holding a huge public meeting at Ahmadabad on December 26th to witness his swearing in ceremony as new Chief Minister of the state for the third time, has invited TDP president Chandrababu Naidu and Balakrishna to it. Perhaps, this should be also considered as an invitation for a poll alliance between BJP and TDP in the upcoming elections in Andhra Pradesh. If, Babu or his representative attends his swearing in ceremony, it would be the first sign of their poll agreement, otherwise, it should be understood that TDP wants to stay away from BJP in the upcoming elections.

Wednesday, October 3, 2012

కాళ్లకు నొప్పులు, 20 ఏళ్లుగా రోజుకు 2గంటలు

అనంతపురం: పాదయాత్ర వల్ల తనకు కాళ్లు నొప్పులు పుడుతున్నాయని, రాత్రి సరిగా నిద్ర పట్టలేదని, అయినప్పటికీ తాను ప్రజల కోసం వీటిని లెక్క చేయనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. రైతు పోరు బాటకు ఈ యాత్రకు చాలా తేడా ఉందని చెప్పారు. ప్రజల కష్టాలు పెరిగాయని, వారిని ఓదార్చేందుకు ఎవరు లేరన్నారు.

Monday, October 1, 2012

Harikrishna in Chandra Babu Padayatra

అనంతపురం/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్రకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, బాబు బావమరిది నందమూరి హరికృష్ణ మద్దతు పలికారు. చంద్రబాబు పాదయాత్ర విజయవంతం కావాలని హరికృష్ణ అనంతపురం జిల్లాలోని సూగురు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మెరుగైన పాలన కోసమే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారన్నారు.

Balakrishna and Nara lokesh in Chandrababu Yatra

హైదరాబాద్: రేపటి నుండి(అక్టోబర్ 2, మంగళవారం) తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టనున్న 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో తొలి రోజు బాబు కుటుంబం మొత్తం పాల్గొననుంది. బాబు సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్‌లు తొలి రోజు యాత్రలో పాల్గొంటారు. అయితే కోడలు బ్రాహ్మణి మాత్రం యాత్రలో పాల్గొనడం లేదు. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. దీంతో యాత్రకు ఆమె దూరంగా ఉంటున్నారు.

Tuesday, September 25, 2012

Balakrishna Words on Telanga

హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఒప్పించడానికి తెలుగుదేశం తెలంగాణ నేతలు కొత్త వాదనను ముందుకు తెస్తున్నారు. చంద్రబాబుకు లేని విశ్వసనీయత బాలకృష్ణకు ఉందనే భావం వచ్చేలా వారి మాటలు ఉన్నాయని గిట్టనివారు అంటున్నారు. తెలంగాణ అనుకూలంగా అవసరమైతే కేంద్రానికి మరోసారి లేఖ ఇస్తామని బాలకృష్ణ ఆ మధ్య కాలంలో అన్నారు.



Kcr and Chandrababu naidu busy on Telangana


న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం ఆలోచించడం లేదని ప్రకటించిన నేపథ్యంలోనే కేంద్ర మంత్రి వాయలార్ రవితో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సమావేశమయ్యారు. ముందు నిర్ణయించుకున్న మేరకే వీరిరువురి భేటీ జరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణపై విస్తృత స్థాయిలో వారు చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం ఆలోచనను తెలుసుకోవడానికి కెసిఆర్ వాయలార్ రవి ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లు చెబుతున్నారు.


Thursday, September 13, 2012

Chandrababu naidu family assets

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన ఆస్తుల వివరాలతో పాటు తన భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి ఆస్తుల విలులను కూడా ఆయన ప్రకటించారు. యేటేటా తన కుటుబ సభ్యుల ఆస్తుల విలువను వెల్లడించాలనే నిర్ణయంలో భాగంగా ఆయన గురువారం ఆ ప్రకటన చేశారు. ఆయన కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ. 35.59 కోట్లు ఉంది. చంద్రబాబు ఆస్తుల విలువ 31.97 కోట్ల రూపాయలు ఉండగా, భార్య భువనేశ్వరి ఆస్తుల విలువ 24.57 కోట్లు రూపాయలు ఉంది. తన పేరు మీద ఇల్లు, కారు ఉందని చంద్రబాబు చెప్పారు.

కాగా, నారా లోకేష్ ఆస్తుల విలువ రూ. 6.62 కోట్ల రూపాయలు ఉంది. చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఆస్తుల విలువ రూ. 2.09 కోట్లు ఉంది. తాను నిరుడు తన ఆస్తుల వివరాలను వెల్లడించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని, తాను కాపాడుకుంటున్నానని ఆయన చెప్పారు. తన పిల్లలు మంచి చదువులు చదువుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారని, అయినా తాను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి వారి ఆస్తుల వివరాలు కూడా వెల్లడిస్తున్నానని ఆయన అన్నారు.

కొంత మంది రాజకీయాలను స్వార్థం కోసం వాడుకుని కోట్లు సంపాదిస్తున్నారని ఆయన విమర్శించారు. పిల్లలకు డబ్బులు ఇవ్వడం కన్నా వారికి మంచి చదువులు చెప్పించాలని ఆయన అన్నారు. హెరిటేజ్ సంస్థల ద్వారా తన కుటుంబ సభ్యులు చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారని ఆయన చెప్పారు. వ్యాపారాలు నీతినిజాయితీలతో చేయవచ్చు, దోచుకోవడానికి చేయవచ్చునని, తన కుటుంబ సభ్యులు నీతినిజాయితీలతో వ్యాపారాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. రెండు ఎకరాలు, రెండు వేల కోట్లు అంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

తన పార్టీకి ఖర్చుల కోసం కూడా నిధులు లేవని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకోవడం తప్పు కాదని ఆయన అన్నారు. అవినీతి కార్యకలపాలు 70 శాతం మన రాష్ట్రంలోనే సాగుతున్నాయని, మన రాష్ట్రంలోని అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే దేశంలోని అవినీతిపై పోరాటం చేసినట్లేనని ఆయన అన్నారు. తన కుమారుడు నారా లోకేష్ కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పడాన్ని ఆయన ఆహ్వానించారు. కార్యకర్తగా ఎవరైనా పనిచేయవచ్చునని ఆయన అన్నారు.

Tuesday, September 4, 2012

When i wa CM chandrababu naidu

హైదరాబాద్: తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ విద్య అందాలనే ఉద్దేశ్యంతో పని చేశానని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. హైదరాబాదులోని ఎల్బీ నగర్‌లో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్సు పైన మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులకు అండగా ఉంటామని బాబు హామీ ఇచ్చారు.

పేద విద్యార్థులను చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. అర్హులైన వారికి ఫీజు రీయింబర్సుమెంట్సుకు దూరం చేయవద్దన్నారు. పదివేల ర్యాంకులు అనే సాకుతో విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందన్నారు. తాను సిఎంగా ఉండగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే పాఠశాలలు, కళాశాలలు ఓపెన్ చేశామన్నారు. పిల్లలకు పోషకహారం లేకుండా అనారోగ్యం పాలవుతున్నారని మధ్యాహ్న భోజనం ప్రవేశ పెట్టామని గుర్తు చేశారు. రీయింబర్సుమెంట్స్ ప్రారంభించింది తామే అన్నారు.

పేదల కోసం ప్రభుత్వం పథకాలు ప్రవేశ పెట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే అర్హులైన అందరు విద్యార్థులకు రీయింబర్సుమెంట్స్ ఇస్తామన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో అందరినీ కన్ఫ్యూజన్‌కు గురి చేస్తోందని విమర్శించారు. కాగా చంద్రబాబు ర్యాలీగా ఎల్బీ నగర్‌లోని ధర్నా స్థలికి చేరుకున్నారు. ధర్నాకు అనుమతి లేదని, విరమించుకోవాలని బాబుకు పోలీసులు చెప్పారు.

అయితే తాము ఎట్టి పరిస్థితుల్లో ధర్నా నిర్వహించి తీరుతామని చెప్పిన బాబు ఆందోళన కొనసాగించారు. అనంతరం కాసేపటికి పోలీసులు రంగ ప్రవేశం చేసి చంద్రబాబు సహా పలువురు విద్యార్థి నేతలను అరెస్టు చేశారు. వారిని వనస్థలిపురం పోలీసు స్టేషన్‌కి తరలించారు. తమ పార్టీ అధినేత విద్యార్థుల కోసం ఉద్యమిస్తుంటే అరెస్టు చేయడమేమిటని, అయినా తొమ్మిదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న బాబుకు అరెస్టులు కొత్త కాదని, ప్రజల కోసం జైలుకెళ్లేందుకైనా ఆయన వెనుకాడరని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. బాబును అరెస్టు చేసే సమయంలో టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.

Monday, September 3, 2012

Chandrababu follows NTR

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు దారిలోనే నడిచే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. 1989-1994 మధ్య కాలంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ టిడిపి అధికారంలోకి వచ్చే వరకు అసెంబ్లీకి రాకూడదని నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు చంద్రబాబు కూడా అలాంటి నిర్ణయమే తీసుకోనున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బాబు వద్ద నేతలు ప్రస్తావించినప్పుడు బాబు తన నిర్ణయాన్ని ఖచ్చితంగా వెల్లడించక పోయినప్పటికీ అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

వంద రోజుల పాటు రాష్ట్ర యాత్రను తలపెట్టిన చంద్రబాబు దీనిని విభిన్నంగా చేయాలని నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన 117 రోజుల పాటు మీ కోసం పేరుతో రాష్ట్ర పర్యటన జరిపారు. ప్రత్యేకంగా రూపొందించిన బస్సులో ఆ యాత్ర జరిగింది. ఈసారి దానికి భిన్నంగా పార్టీ నేతలు ఎక్కువ మంది సైకిల్ యాత్రను ప్రతిపాదించారు. సైకిల్ తెలుగుదేశం పార్టీ గుర్తు. సామాన్యుడి వాహనం. దానిపై ప్రజల్లోకి వెళ్తే విభిన్నంగా ఉంటుంది. రాష్ట్రం మొత్తాన్ని ఇంతవరకూ సైకిల్‌పై పర్యటించిన నేత లేరు. ప్రజలకు చేరువగా వెళ్లడానికి ఇంతకు మించిన మార్గం లేదన్నది పలువురి వాదన.

బస్సుతో పోలిస్తే సైకిల్‌పై ఎక్కువ ప్రాంతాన్ని సందర్శించడం సాధ్యం కాదని, పైగా ప్రజల వద్ద ఆగి మాట్లాడుతూ వెళ్లడానికి ఈ యాత్ర అంత సౌకర్యంగా ఉండదన్నది మరికొందరి అభిప్రాయం. అదే సమయంలో, చంద్రబాబు మొగ్గు పాదయాత్రపై ఉన్నట్లు చెబుతున్నారు. దీని వల్ల సామాన్యుల్లోకి వెళ్లి వారిలో కలిసిపోవడం తేలికగా ఉంటుందని, ఎక్కడైనా ఆగవచ్చు.. ఎవరితోనైనా మాట్లాడవచ్చన్నది ఆయన అభిప్రాయం. గతంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర బాగా ప్రచారం పొందినందున ఇప్పుడు అలా చేస్తే ఆయన్ని అనుకరించినట్లవుతుందని, అది సరైంది కాదేమోనన్న అభిప్రాయంలో వారున్నారు.

ఈ రెండూ కాకపోతే గతంలో మాదిరిగా బస్సు యాత్ర నిర్వహించాలన్నది మూడో ప్రతిపాదన. విభిన్నంగా ఉండాలనుకుంటే తప్ప అన్నింటికంటే ఇది మేలైందని, ఎక్కువ ప్రాంతాలను సందర్శించవచ్చని ఆ పార్టీ నాయకులు కొందరు అంటున్నారు. అక్టోబర్ 2న ఈ యాత్ర మొదలు పెట్టాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నారు. చంద్రబాబు పర్యటనలు ఏవైనా హైదరాబాద్ నుంచో లేదా తిరుపతి నుంచో మొదలు కావడం సంప్రదాయం.

కానీ, ఈసారి శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు తన యాత్రను శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టడమే దీనికి కారణం. జడ్ కేటగిరీలో ఉండటంతో ఆయన ఎక్కడ పర్యటించినా చుట్టూ భారీగా భద్రతా సిబ్బంది ఉంటున్నారు. ఈసారి వారిని వెనక ఉంచాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. చంద్రబాబుకు ఇప్పటికీ భద్రత సమస్య ఉందని, ఆ విషయంలో ఆచితూచి వ్యవహరించకపోతే ఇబ్బంది తప్పదని వారు వాదిస్తున్నారు. ఈ యాత్రను జనవరి 26న ముగించాలని చంద్రబాబు మొదట అనుకొన్నారు. ఫిబ్రవరి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండటం దీనికి కారణం.

కానీ ఒక సీనియర్ నేత.. బాబు యాత్రను అప్పుడే ఆపవద్దని కోరారు. అసెంబ్లీకి మీరు రాకపోయినా పర్వాలేదని, తామంతా ఉన్నామని, మీరు జనంలోనే ఉండండని, మీరు ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే పార్టీకి అంత మేలు అని, గతంలో ఎన్టీఆర్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారని చెప్పారు. దీనిపై బాబు తన నిర్ణయాన్ని చెప్పనప్పటికీ సుముఖంగానే ఉన్నారని అంటున్నారు. కాగా బాబు ఒకవేళ బస్సు యాత్ర చేపడితే అందుకోసం ఓ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పూణేలో ప్రత్యేకంగా చేయించనున్నారట.

Friday, August 31, 2012

Chandrababu ready to give letter on telangana

హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలకు సంస్థాగతంగా పట్టులేదని, కొద్దిగా కష్టపడితే పార్టీ బాగా పుంజుకుంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పార్టీ నేతలకు సూచించారు.

శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో పార్టీ ప్రజాప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆయన వారికి పలు సూచనలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు సెంటిమెంటు మీద నడుస్తున్నాయని, ఆ పార్టీలకు సంస్థాగతంగా పట్టు లేదని అన్నారు. అదే సమయంలో టిడిపికి మంచి పట్టు ఉందని, దానిని వినియోగించుకుంటే బలం పుంజుకుంటుందని చెప్పారు. పార్టీ చేపడుతున్న ఆందోలన కార్యక్రమాల పట్ల చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఎస్సీ కేటగరైజేషన్ పైన స్పష్టత ఇచ్చిన చంద్రబాబు తెలంగాణ విషయంలో కూడా స్పష్టత ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సమావేశంలో బాబు మాట్లాడుతూ.. తెలంగాణపై సెప్టెంబర్ రెండో వారంలోగా పార్టీ తరఫున స్పష్టత ఇస్తామని నేతలకు తెలిపారు. తెలంగాణ విషయంలో ఇతర పార్టీల నేతలు వ్యక్తిగతంగా చేసే ప్రకటనలను తాను పట్టించుకోనని చెప్పారు. రేపటి నుండి అన్ని ప్రాంతాల నేతలతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. కాగా సమన్వయ కమిటీని నియమించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. స్వతంత్రంగా వ్యవహరించాలని, తనపై ఆధారపడవద్దని వారికి చంద్రబాబు సూచించారు.

కాగా ఇటీవల చంద్రబాబు పలు అంశాలలో దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నాళ్లుగానో నాన్చుతూ వస్తున్న పలు అంశాలపై ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఒక్క తెలంగాణ విషయంలోనే బాబు నిర్ణయం పెండింగ్‌లో ఉంది. దానిపై కూడా సాధ్యమైనంత త్వరగా నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలంగాణకు లేఖ ఇచ్చే పక్షంలో రాయలసీమకు కూడా మద్దతు పలకాలని బాబును డిమాండ్ చేస్తున్నారు.

Tuesday, August 28, 2012

Chandrababu blames late YSR

హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన తప్పు వల్లే పార్లమెంటులో స్వర్గీయ నందమూరి తారక రామారావు, మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజుల విగ్రహాలను నెలకొల్పే వ్యవహారంలో వివాదం చోటు చేసుకుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. సాయంత్రం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటు లోపల కేవలం రెండే విగ్రహాలు పెట్టడానికి ఖాళీ మిగిలినప్పుడు సంబంధిత కమిటీలో సభ్యుడిగా ఉన్న టిడిపి పార్లమెంటు సభ్యులు ఎర్రన్నాయుడు ఈ రెండు పేర్లు ప్రతిపాదించి ఆమోదింప చేశారని చెప్పారు.

అప్పటి సిఎం వైయస్ రాజకీయ ద్వేషంతో ఆ విగ్రహాలు ఇవ్వక పోగా దానిని వ్యతిరేకించారన్నారు. స్పీకర్ చాలాకాలం చూసి మమ్మల్ని అడిగారని, విగ్రహాలు ఇవ్వడానికి మేం అంగీకరించి.. పార్లమెంటు నిబంధనల ప్రకారం నమూనాలు పంపి ఆమోదం తీసుకున్నామని, ఈ దశలో కేంద్రమంత్రి దగ్గుపాటి పురందేశ్వరి జోక్యం చేసుకొని ఎన్టీఆర్ కూతురుగా తాను ఇస్తానని స్పీకర్‌కు లేఖ రాశారని చెప్పారు. దాంతో వివాదం మొదలైందని చెప్పారు.

పార్టీ, కుటుంబం రెండింటి తరపునా విగ్రహాలు ఇస్తామని అందరం సంతకాలు పెట్టి స్పీకర్‌కు లేఖ ఇచ్చామని, దానిపై ఆమె సంతకం పెడితే వివాదం సమసిపోయేదని, కానీ పెట్టలేదన్నారు. కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి స్పీకర్‌కు లేఖ రాయడం వల్లే పార్లమెంట్‌లో ఎన్టీ రామారావు విగ్రహ ఏర్పాటు ఆలస్యమవుతోందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తలెత్తిన వివాదంపై ఆయన మంగళవారం వివరణిచ్చారు.

ఏది ఏమైనా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే ఆయన విగ్రహాన్ని పార్లమెంట్‌కు ఇవ్వాలన్న నిర్ణయంతో సమస్యకు తెరపడిందన్నారు. పురందేశ్వరి కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలిగా తన సమ్మతిని తెలియజేస్తూ స్పీకర్‌కు లేఖ రాస్తే సమస్య పూర్తిగా తొలిగిపోయి విగ్రహ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్ విగ్రహాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని, రాజకీయాలు ఎవరు చేస్తున్నారో టిడిపి పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు అన్నారు.

Chandrababu blames purandheswari

హైదరాబాద్: పార్లమెంటు ఆవరణలో తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు విగ్రహ స్థాపనలో జాప్యంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిని నిందించారు. పురంధేశ్వరి వల్లనే ఎన్టీఆర్ విగ్రహ స్థాపనలో జాప్యం జరుగుతోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. విగ్రహ స్థాపనపై తమ పార్టీ ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా నడుస్తోందని వెల్లడించిన ఎన్డిటివీ సర్వేపై ఆయన గుర్రుమన్నారు. వైయస్ జగన్‌కు అనుకూలంగా ఓ టీవీ చానెల్ సర్వే నిర్వహించిందని ఆయన అన్నారు. సర్వే చేసిన చానెల్ జగన్ మీడియాకు కన్సల్టెన్సీ అని వింటున్నామని ఆయన అన్నారు. తన విదేశీ పర్యటనలను రాజకీయం చేయడం దారుణమని ఆయన అన్నారు.

విద్యుచ్ఛక్తి రంగంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అవగాహన లేదని ఆయన అన్నారు. తెలంగాణపై త్వరలో స్పష్టత ఇస్తానని ఆయన చెప్పారు. విభజనపై పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ దానికి కట్టుబడి ఉంటారని ఆయన చెప్పారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి వచ్చిన డబ్బంతా గనుల ద్వారా వచ్చిందేనని ఆయన అన్నారు. అడ్డంగా దోచుకునేందుకు ఖనిజ సంపద, సెజ్‌లను మార్గాలుగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు.

పార్లమెంటు ఆవరణలో ఎన్టీ రామారావు విగ్రహ స్థాపనపై మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దగ్గుబాటి పురంధేశ్వరి కూడా తెలుగుదేశం పార్టీ తీరును తప్పు పట్టారు. అదే విధంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి చంద్రబాబు విదేశీ పర్యటనలపై విచారణ జరిపించాలని కోరుతూ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. వైయస్ జగన్‌ను మెజారిటీ ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని ఎన్డీటివీ తన సర్వేలో తేల్చింది. వీటన్నింటిపై విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన చంద్రబాబు మంగళవారంనాటి మీడియా సమావేశంలో ప్రతిస్పందించారు.

Saturday, August 18, 2012

Chandrababu naidu resonds on family differences

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై స్పందించారు. ప్రధానమంత్రి తీరు, రాష్ట్ర ప్రభుత్వం వైఖరి, అన్నా హజారే అవినీతి ఉద్యమం, నారా-నందమూరి కుటుంబం తదితర అంశాలపై స్పందించారు. కొత్త ఓటర్లకు స్వర్గీయ ఎన్టీఆర్ గురించి తెలియదని, అందుకే వాళ్లకు అవినీతిపరులైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిలు హీరోలుగా కనిపిస్తున్నారన్నారు.

తమది పెద్ద కుటుంబం కావడంతో కొన్ని బేధాభిప్రాయాలు రావడం సహజమేనని, అయితే కుటుంబం మొత్తం కలిసి ఉంటేనే పార్టీ అధికారంలోకి వస్తుందనుకోవడం పొరపాటు అన్నారు. గత సాధారణ ఎన్నికలలో చిరంజీవి కుటుంబం అంతా కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నదని, కానీ ఆయన ఓడిపోయారని, అదే వైయస్ రాజశేఖర రెడ్డి వెనుక కుటుంబం లేకున్నా గెలుపొందారన్నారు. సామాజిక సంస్కర్త అన్నా హజారే రాజకీయ పార్టీ పెట్టి తప్పు చేశారని, ఒక వ్యక్తిగా అవినీతిపై పోరాడితే మరో మహాత్మా గాంధీలా మిగిలి పోయేవారని, కానీ ఆయన పార్టీ పెట్టి జాతికి అన్యాయం చేశారన్నాలు.

స్వయంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతిలో ఉన్న గనులశాఖలో రూ. 1.86 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, ఇది చెప్పుకోవడానికే సిగ్గు చేటన్నారు. బొగ్గు గనుల కేటాయింపులో 1.86 లక్షల కోట్లు, దానికి ముందు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో 1.76 లక్షల కోట్లు... రాష్ట్రంలో వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రానికి, దేశానికి శాపంగా మారాయన్నారు. ప్రధాని పెద్దమనిషి అయితే కావొచ్చు గానీ, ఆయన అసమర్ధుడని, చుట్టూ దొంగలను పెట్టుకుని తాను మౌనమునిలా కళ్లు మూసుకుని కూర్చున్నాడని విమర్శించారు.

బొగ్గు గనుల కేటాయింపులో అవకతవకలపై కాగ్ నివేదికను ప్రస్తావిస్తూ అవినీతిపరులైన మంత్రులు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నా ప్రధాని నోరు మెదపకపోవడాన్ని తప్పుబట్టారు. టిడిపి పాలనలో వ్యవసాయానికి కచ్చితంగా రోజకు 9 గంటలు కరెంట్ ఇచ్చేవారమని, ఇప్పుడు రోజుకు రెండు గంటలు కూడా రావట్లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కరెంటు సమస్యపైనే కాదు, ఏ శాఖపైనా అవగాహన లేదన్నారు. అందుకే ఆయన తనకు తెలిసిన క్రికెట్ మీద దృష్టిపెట్టి స్టేడియంకు వెళ్లిపోతున్నాడని ఎద్దేవా చేశారు.

ఈ అరాచక పాలన అంతం కావాలంటే విద్యావంతుల్లో చైతన్యం రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల తరువాత టిడిపి తన విధానాలను మార్చుకుందని, సామాజిక న్యాయమే నినాదంగా ముందుకెళ్తోందని చంద్రబాబు తెలిపారు. తాము ప్రవేశపెట్టిన బిసి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోందన్నారు. ముస్లింల ఆర్థికాభివృద్ధికి, అగ్రవర్ణ పేదలకు కూడా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామన్నారు.

Monday, August 13, 2012

బాబు పెద్ద మాదిగ: మోత్కుపల్లి, మందకృష్ణ సత్కారం

హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తెలుగుదేశం నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సోమవారం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని సత్కరించారు. ఈ మేరకు సోమ వారం అనుచరులతో కలిసి పార్టీ కార్యాలయానికి వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, దీనివల్ల దళితుల్లోని అన్ని ఉప కులాలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు మిగిలిన పార్టీలూ టిడిపిని స్ఫూర్తిగా తీసుకోవాలని, లేకపోతే దళితులు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని, తెలంగాణ విషయంలోనూ చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకొంటే ఈ ప్రాంతంలో ఆయన ఘన విజయం సాధిస్తారని ఆయన అన్నారు. సామాజిక న్యాయ కోణంలో స్వాతంత్య్ర ఫలాలు జనాభా ప్రాతిపదికన అందరికీ అందాలన్న ఉద్దేశంతోనే వర్గీకరణకు అనుకూలం నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు వివరించారు.

"అణగారిన వర్గాలకోసం మందకృష్ణ 18 ఏళ్లుగా పనిచేస్తున్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణను అమలు చేయడంవల్ల విద్య ఉద్యోగాల్లో వేలాది మాదిగలకు న్యాయం జరిగింది. సామాజిక న్యాయ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నది టిడిపి ఒక్కటే'' అని ఆయన స్పష్టంచేశారు. వర్గీకరణపైనిర్ణ యంతో చంద్రబాబు ఇప్పుడు 'మాదిగల్లో పెద్ద మాదిగ' అని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు అభివర్ణించారు. "చంద్రబాబుకు మాదిగలంతా సంపూర్ణ మద్దతు ప్రకటించాలి. ఆ విషయంలో వెనకడుగేస్తే భవిష్యత్తు లో వారిగురించి మాట్లాడే నాథుడే ఉండడు'' అ ని హెచ్చరించారు.

కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు కడియం శ్రీహరి, పట్నం సుబ్బయ్య, శమంతకమణి, డి.శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉస్మానియా వర్సిటీ జేఏసీ నేత దరువు ఎల్లన్న ఆధ్వర్యంలో వందమంది ఓయూ దళిత విద్యార్థులు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపా రు. మందా మోహన్, కిరణ్, రాజేందర్, సురేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు నాయకత్వంలో ఆ సంఘం రాష్ట్ర నేతలు చంద్రబాబుకు డప్పు బహూకరించారు. కాగా, ప్రభు త్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నవంబర్ 10న ధర్నా నిర్వహిస్తామని పేరుపోగు ప్రకటించారు. తెలంగాణ మాదిగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటికాయల జయరాం ఆధ్వర్యంలో పలువురు నేతలు ధన్యవాదాలు తెలిపారు. మహామాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు దేవయ్య మాదిగ నేతలతో వచ్చి కృతజ్ఞతలు తెలిపారు.

Saturday, August 11, 2012

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చంద్రబాబు మద్దతు

హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశానంతరం ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై పోలిట్‌బ్యూరో సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి, వర్గీకరణకు మద్దతు తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

తాజా రిజర్వేషన్లతో ఎస్సీల్లోని అన్ని వర్గాలకు సమ న్యాయం జరగడం లేదని, సమన్యాయం జరగాలంటే వర్గీకరణ అవసరమని, వర్గీకరణ కోసం చాలా కాలంగా ఆందోళనలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. జానాభా ప్రాతిపదికపై ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సిందేనని ఆయన అన్నారు. గతం నుంచి కూడా తాము వర్గీకరణకు మద్దతు ఇస్తున్నామని, మరోసారి చర్చించి ఆ వైఖరిని కొనసాగించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.

సామాజిక న్యాయానికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని పలు కమిటీలు అభిప్రాయపడ్డాయని, అందుకు శాసనసభ కూడా నాలుగు సార్లు తీర్మానం చేసిందని ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు తాను మరోసారి కేంద్రానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. తాము వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, ఇతర పార్టీల గురించి తామేమి చెప్పలేమని ఆయన అన్నారు.

ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారనేది ప్రజలు గమనిస్తున్నారని, తమకు మాత్రం వర్గీకరణ న్యాయంగా తోచిందని, అయితే ఏమైనా సలహాలు వస్తే తీసుకుంటామని ఆయన చెప్పారు. వేరే రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలియదు గానీ మన రాష్ట్రంలో మాత్రం వర్గీకరణ జరగాలని కమిటీలు నివేదికలు ఇచ్చాయని ఆయన అన్నారు. వర్గీకరణపై మిగతా పార్టీలు వాటి వైఖరిని చెప్పుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

సామాజిక కార్యకర్త అన్నా హజారేకు దేశం నీరాజనం పట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో కుంభకోణాలు పెరిగాయని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్, తదితర కుంభకోణాలను ఆయన ప్రస్తావించారు. దేశంలో అవినీతి పెచ్చరిల్లిందని ఆయన అన్నారు.

Monday, July 30, 2012

Chandrababu Naidu meets SC Leaders

హైదరాబాద్: రాష్ట్రంలోని బిసీ ఓటర్లను ఆకట్టుకోవడానికి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇక ఎస్సీలపై దృష్టి పెట్టారు. ఎస్సీ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన పథకం రూపొందించే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇందుకుగాను, ఆయన ఆగస్టు 1,2 తేదీల్లో ఎస్సీ నాయకులతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై ఆయన మరోసారి స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు అంగీకరించింది.

తాజా పరిణామాల నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై చంద్రబాబు మరోసారి స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఎస్సీలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట నడుస్తున్నట్లు ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు తేల్చాయని అంటున్నారు. ముఖ్యంగా, క్రిస్టియన్ ఎస్సీలు ఆయనకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తేలింది. వీరిలో ఎక్కువ మంది సీమాంధ్రకు చెందిన మాలలు ఉన్నారని అంచనాలు వెలువడ్డాయి.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు ఇవ్వడం వల్ల మాలలు దూరమయ్యారా అనే కోణాన్ని కూడా చంద్రబాబు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. దాంతో మాలలకు, మాదిగలకు అంగీకారయోగ్యమైన ఫార్ములాను రూపొందించే పనిలో ఆయన పడినట్లు చెబుతున్నారు. ఈ ఫార్ములా ఎలా ఉంటుందనేది మాత్రం తెలియడం లేదు.

బీసీ డిక్లరేషన్ ద్వారా బిసీల్లో నమ్మకం కలిగించడానికి చేసిన ప్రయత్నం ఫలిస్తుందని, అలాగే ఎస్సీలకు నమ్మకం కలిగించే ఓ స్కీమ్‌ను తయారు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎస్టీలకు సంబంధించిన మేధో మథన సదస్సు నిర్వహించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణపై కూడా చంద్రబాబు స్పష్టత ఇస్తారని అంటున్నారు. అన్ని అంశాలపై, అన్ని సామాజిక వర్గాలపై ఒక స్పష్టతతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.

అప్పుడే 2014 అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు దృష్టి

హైదరాబాద్: 2014లో జరిగే సాధారణ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అప్పుడే సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.. బీసీలకు వంద సీట్లు కేటాయిస్తామని, ఏడాది ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆ మేరకు ఏడాదిన్నర ముందుగానే అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారు. బీసీ అభ్యర్థులతో పాటు ఇతర అభ్యర్ధుల్నీ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జ్‌లు లేని నియోజక వర్గాల్లో ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ, ‘వచ్చే ఎన్నికల్లో మీకే టికెట్, మీ నియోజకవర్గాలపై ఇప్పటి నుంచే దృష్టి సారించండి' అని చంద్రబాబు నేతలకు ఆదేశిస్తున్నారు.

గతంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు టికెట్ లభిస్తుందనే గ్యారంటీ ఉండేది కాదు. ఏళ్ల తరబడి నియోజకవర్గంలో పార్టీ వ్యయాన్ని భరించి తిప్పలు పడే వారు ఒకరైతే, తీరా ఎన్నికలు సమీపించినప్పుడు టికెట్ వేరే వారికి లభించేది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నాయకుల్లో నమ్మకం లేకుండా పోయింది. ఈ ఎత్తుగడ ప్రారంభంలో పార్టీకి ఉపయోగపడిందని భావించినా, చివరకు టికెట్‌పై ఎలాంటి గ్యారంటీ లేకపోవడం నాయకుల్లో ఉత్సాహం సన్నగిల్లింది. ఎవరికి వారు ప్రచారంలో హడావుడి చూపడం తప్ప నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల నిర్వాహణకయ్యే వ్యయాన్ని భరించడానికి పెద్దగా ఆసక్తి చూపడం తగ్గింది. ఇప్పుడు పలువురు ఇన్‌చార్జ్‌లకు వచ్చే ఎన్నికల్లో మీరే అభ్యర్థులు అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

సమీక్షా సమావేశాల్లోనూ, నాయకులతో విడిగా చర్చించే సమయంలోనూ ఇన్‌చార్జ్‌లే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులని చంద్రబాబు వెల్లడించారు. అంతేకాకుండా ఇన్‌చార్జ్‌లు లేని నియోజక వర్గాల్లో ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ, వచ్చే ఎన్నికల్లో మీకే టికెట్ అని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా పామర్రు ఇన్‌చార్జ్‌గా వర్ల రామయ్యను నియమించారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ ఇన్‌చార్జ్‌గా పాల్వాయి రజనీకుమారిని నియమించారు. 2004 ఎన్నికల సమయంలో సూర్యాపేట మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న ఆమెను చివరి నిమిషంలో సూర్యాపేట అభ్యర్థిగా ప్రకటించగా, ఆమె ఓడిపోయారు. ఇప్పుడు నకిరేకల్ ఇన్‌చార్జ్‌గా నియమించారు.

2007లో వరంగల్ బీసీ డిక్లరేషన్‌లోనే బీసీలకు వంద సీట్లు కేటాయించనున్నట్టు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. అయితే 2009 ఎన్నికల్లో ఆ మాట నిలబెట్టుకోలేదు. దాంతో ఇప్పుడు ముందుగానే బీసీ అభ్యర్థులకు వంద సీట్లు కేటాయించడం ద్వారా బీసీల్లో విశ్వాసం కలిగించడంతోపాటు ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 74మంది బీసీ అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని తెలుగుదేశం నాయకుడు కెఇ కృష్ణమూర్తి ప్రకటించారు. ఏడాదిముందే వంద సీట్లు అని ప్రకటించిన మాట నిలబెట్టుకొని, వందకన్నా కొన్ని సీట్లు అధికంగా ఇవ్వడంతోపాటు ఏడాది కన్నా ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా బీసీల విశ్వాసాన్ని చూరగొంటాం అని పార్టీ నేతలు చెబుతున్నారు.

Thursday, July 26, 2012

Youth should be in active politics

హైదరాబాద్: యువశక్తిని తాము రాజకీయాల్లో ప్రోత్సహిస్తామని, యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
మనదేశానికి ఉన్న యువశక్తి మరే దేశానికీ లేదని, రాష్ట్రంలో కూడా అపారమైన యువశక్తి ఉందని.. అయితే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాత్రం యువత భవిష్యత్తు గురించి పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో గత ఎనిమిది సంవత్సరాలుగా నిరుద్యోగం, రౌడీయిజం, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెంకట లక్ష్మీనారాయణ, వంశీకృష్ణ నేతృత్వంలో పలువురు విద్యార్థులు గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రాబాబు మాట్లాడారు. రాజీవ్ యువకిరణాలు, రాజీవ్ ఉద్యోగశ్రీ అంటూ మాటలు చెబుతున్న ముఖ్యమంత్రి.. యువత భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. యువత భవిష్యత్తును తీర్చిదిద్దడం ద్వారా రాష్ట్రాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతోనే టీడీపీ హయాంలో పలు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ ప్రమాణాలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

విలువలతో కూడిన పాలన రావాలంటే యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. అవినీతిపరుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. రాష్ట్రంలో, దేశంలో అవినీతిని అంతమొందించేందుకు తెలుగుదేశం చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత కోసం ఎంట్రప్రెన్యూర్ డెవలప్‌మెంట్ కోర్సులను నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మువ్వా గోపాలకృష్ణ, వెంకటేష్, శివవర్ధన్ రెడ్డి తదితర విద్యార్థి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరోవైపు.. టీడీపీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యాదవ సంఘం నేతలు సత్యం, వెంకటేష్, హన్మంత్, శ్రీరాములు, గోవింద్ తదితరులు చంద్రబాబును కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. గొర్రెలు, మేకల సహకారాభివృద్ధి ఫెడరేషన్‌కు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు. గొర్రెల కాపరులకు ఎక్స్‌గ్రేషియా అందకపోయినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జిల్లాల వడ్డెర సంఘం నేతలు సాంబరాజ్, గుంజే హన్మంతు, మైసయ్య, మనోహర్ తదితరులు కూడా చంద్రబాబును కలిసి కృతఙ్ఞతలు తెలిపారు.

వడ్డెరలను ఎస్టీల్లో చేర్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, పి. చంద్రశేఖర్, కనకాచారి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. విద్యుత్తు కోతలను నిరసిస్తూ ఈ నెల 31న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద సామూహిక ధర్నాలను నిర్వహించాలని టీడీపీకి చెందిన టీఎన్టీయూసి నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నారు. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు జి. రాంబాబు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు.

ప్రజలపై అడ్డగోలు పన్నులు, చార్జీలు వేసి ముక్కు పిండి వసూలు చేయడంలో కిరణ్ పాలన తుగ్లక్ పాలనను మరిపిస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శోభారాణి విమర్శించారు. ప్రజలపై భారం మోపబోనని.. ఇందిరమ్మ పాలన తెస్తానని ముఖ్యమంత్రి అయిన కొత్తలో కిరణ్ పదేపదే ప్రకటనలు చేస్తే నిజమేనని నమ్మిన ప్రజలకు ఇప్పుడు శఠగోపం పెడుతున్నారని, అయినకాడికి వాతలు పెట్టి ఖజానా నింపుకోవడమే పనిగా పాలన నడిపిస్తున్నారని ఆమె ఆరోపించారు.

వీలునామా చార్జీలను ఒకేసారి రూ.పది నుంచి రూ.ఐదు వేలకు పెంచడం చరిత్రలో ఉండి ఉండదని, వీలునామాలపై కూడా పన్నులను వడ్డించవచ్చన్న ఘనమైన ఆలోచన ఈ ముఖ్యమంత్రికే వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రం పెట్రోలు రేట్లను 26 సార్లు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా వ్యాట్, విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీల పేరుతో బాదుతోందని ఆమె అన్నారు. 'వైఎస్ హయాంలో ఆయన అనుయాయులు అయిన కాడికి ఖజానాను దోచుకొని పోయారు. ఆ నష్టం భర్తీ చేసుకోవడానికి కిరణ్ సర్కారు ప్రజలపై అడ్డగోలుగా భారాలు వేస్తోంది. దీనిని మేం ఖండిస్తున్నాం. ఈ చార్జీల పెంపును తక్షణం ఆపాలి' అని డిమాండ్ చేశారు.

Monday, July 23, 2012

Chandrababu challenges all other parties

హైదరాబాద్: దమ్ముంటే తాము ప్రకటించిన బిసీ డిక్లరేషన్‌ను ఇతర పార్టీలు అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు. "బీసీ డిక్లరేషన్‌తో రాష్ట్ర రాజకీయాల్లో బీసీ ఎజెండాను తెలుగుదేశం ముందుకు తెచ్చింది. దీనిపై గ్రామస్థాయి వరకూ చర్చ జరుగుతోంది. దేశంలో కూడా ప్రతీ పార్టీ బీసీల అభివృద్ధిపై తమ విధానం ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. స్పందించని పార్టీలు చరిత్ర హీనులుగా మిగిలిపోతాయి'' అని ఆయన అన్నారు.

సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో అఖిల భారత యాదవ మహాసభ, ముదిరాజ్ సంఘాలు చంద్రబాబును బీసీ డిక్లరేషన్ విషయంలో ఘనంగా సత్కరించాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తమ పార్టీ విడుదల చేసిన బీసీ డిక్లరేషన్‌కు అపూర్వ స్పందన వస్తోందని తెలిపారు. "టిడిపి బీసీల పార్టీ. రాష్ట్రంలో బీసీలకు మొదటిసారిగా పెద్దపీట వేసిన ఘనత టీడీపీదే. కీలకమైన మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవిని కూడా బీసీలకు ఇచ్చాం'' అని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయి ఉద్యమానికి తమ పార్టీ శ్రీకారం చుడుతోందని ప్రకటించారు. బీసీలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నానని, వంద సీట్లు ఇచ్చి తన ని జాయితీని నిరూపించుకొంటానని ఆయన అన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ల కల్పనకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

కొన్ని పార్టీలు బీసీలకు చేసిందేమీ లేకపోయినా వారి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని బాబు ఆరోపించారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల మధ్య పోటీ ఏర్పడితే అంతిమంగా బీసీలు లాభపడతారని, దానికి టీడీపీ నాంది పలికిందని అన్నారు. ఆగస్టు రెండో వారంలో బీసీల సమస్యలపై కేంద్రం వద్దకు వెళ్తున్నట్లు తెలిపారు.

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget