హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఒప్పించడానికి తెలుగుదేశం తెలంగాణ నేతలు కొత్త వాదనను ముందుకు తెస్తున్నారు. చంద్రబాబుకు లేని విశ్వసనీయత బాలకృష్ణకు ఉందనే భావం వచ్చేలా వారి మాటలు ఉన్నాయని గిట్టనివారు అంటున్నారు. తెలంగాణ అనుకూలంగా అవసరమైతే కేంద్రానికి మరోసారి లేఖ ఇస్తామని బాలకృష్ణ ఆ మధ్య కాలంలో అన్నారు.
చంద్రబాబు మనసును తెలంగాణకు అనుకూలంగా మళ్లించాడనికి పార్టీ తెలంగాణ నేతలను ఆ మాటలను వాడుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా మరోసారి కేంద్రానికి లేఖ ఇస్తామని చెబుతూ వస్తున్నామని, అందువల్ల ఈ సమయంలో స్పష్టంగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని స్పష్టత ఇవ్వాలని వారు చంద్రబాబును కోరుతున్నారు.
మంగళవారం సాయంత్రం నుంచి తెలంగాణపై స్పష్టత ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సీమాంధ్ర, తెలంగాణ నేతల ఉమ్మడి సమావేశాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా మరోసారి లేఖ ఇవ్వడం అనవసరమని సీమాంధ్ర నాయకులు వాదిస్తున్న తరుణంలో తెలంగాణ నేతలు బాలకృష్ణ మాటలను తెర మీదికి తెచ్చారు.
బాలకృష్ణ మాటలను ప్రజలు విశ్వసిస్తున్నారని, బాలకృష్ణ తెలంగాణ అనుకూలంగా మాట్లాడిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందని వారు అంటున్నారు. ఇప్పుడు వెనక్కి తగ్గితే బాలకృష్ణ కూడా విశ్వసనీయత కోల్పోతారనే అర్థం వచ్చేలా వారు మాట్లాడుతున్నారు. ఇదివరకే చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారని, ఇక బాలకృష్ణ కూడా విశ్వసనీయత కోల్పోతే చేసేదేమీ ఉండదని వారు అంటున్నట్లు అర్థాలు తీస్తున్నారు. ఏమైనా, పనిని సానుకూల పరుచుకోవడానికి ఎన్ని పాట్లైనా పడాలని తెలంగాణ తెలుగుదేశం నాయకులు అనుకుంటున్నట్లున్నారు.

0 comments:
Post a Comment