హైదరాబాద్: రేపటి నుండి(అక్టోబర్ 2, మంగళవారం) తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టనున్న 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో తొలి రోజు బాబు కుటుంబం మొత్తం పాల్గొననుంది. బాబు సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్‌లు తొలి రోజు యాత్రలో పాల్గొంటారు. అయితే కోడలు బ్రాహ్మణి మాత్రం యాత్రలో పాల్గొనడం లేదు. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. దీంతో యాత్రకు ఆమె దూరంగా ఉంటున్నారు.
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ కూడా బాబు యాత్ర చేస్తున్న సమయంలో మధ్యలో ఓసారి ఆయనను కలవనున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు మంగళవారం రోజు చంద్రబాబు తన ఇంటి నుండి నేరుగా సికింద్రాబాదులోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వెళ్తారు. ఆక్కడ ఆయనకు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుండి ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్ళి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళి, అటు నుండి అనంతపురం వెళ్తారు.
హిందూపురంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత పాదయాత్రను చేపడతారు. అక్కడ చంద్రబాబు పాదయాత్రకు గుర్తుగా మహాత్మా గాంధీ, స్వర్గీయ నందమూరి తారక రామారావు, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఆవిష్కరిస్తారు.
కాగా ఆదివారం ఉదయం నందమూరి బాలకృష్ణ బావ చంద్రబాబు ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. బాబుతో బాలయ్య అరగంటకు పైగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పాదయాత్ర ఏర్పాట్లు, యాత్రకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై మాట్లాడారు.

0 comments:
Post a Comment