హైదరాబాద్:
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి
జడ్ కెటగిరీ సెక్యూరిటీ కల్పించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోరింది. ఈ మేరకు ఇంటలిజెన్స్
అదనపు డిజి ఎం మహేందర్
రెడ్డికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కె. మహేందర్ రెడ్డి,
రెహ్మాన్ ఓ లేఖ రాశారు.
ప్రస్తుతం జగన్కు కల్పించిన
భద్రత సరిపోదని వారు అభిప్రాయపడ్డారు.
జగన్కు ప్రస్తుతం స్పెషల్
కెటగిరీ భద్రత కల్పించారు. ఇందులో
భాగంగా బుల్లెట్ ప్రూఫ్ కారు, ఫోర్ ప్లస్
ఫోర్ సెక్యూరిటీ ఉంటుంది. జగన్కు ఈ
భద్రత సరిపోదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. జగన్కు ఇచ్చిన
బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు చెబుతున్నారు. గతవారం
సంగారెడ్డిలో పర్యటించినప్పుడు అది విరిగిపోయిందని వారు
చెప్పారు.
కాగా,
కాంగ్రెసు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణపై వైయస్ జగన్ వర్గానికి
చెందిన 17 మంది శానససభ్యులపై అనర్హత
వేటు పడిన విషయం తెలిసిందే.
జగన్ వర్గానికి చెందిన ఆ 17 మందికి ప్రభుత్వం
ఉపసంహరించుకుంది. ఈ స్థితిలో వైయస్
జగన్కు జడ్ కెటగిరీ
భద్రత కల్పించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కోరుతున్నారు.
వైయస్
జగన్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో
జరిగే ఉప ఎన్నికల నేపథ్యంలో
ఆయన మరింత విస్తృతంగా పర్యటించేందుకు
ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో గెలిచి
తీరాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. ఈ
స్థితిలో ఆయనకు భద్రత పెంచాలని
వైయస్సార్ కాంగ్రెసు నాయకులు కోరడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
0 comments:
Post a Comment