హైదరాబాద్:
ఓ వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో
హీరో నిఖిల్ రెడ్డిపై రాజధాని నగరం హైదరాబాదు పోలీసులు
బుధవారం చీటింగ్ కేసు నమోదు చేశారు.
చీటింగ్కు పాల్పడిన నిఖిల్
రెడ్డి గతంలో వచ్చిన అంగ్రీజ్
సినిమాలో హీరోగా నటించినట్లుగా తెలుస్తోంది. ఓ వ్యాపారవేత్త వద్ద
నిఖిల్ రెడ్డి రూ.50 లక్షలు తీసుకొన్నాడు.
తన డబ్బులు ఇవ్వాలని అడిగేందుకు వెళ్లిన ఆ వ్యాపారవేత్తను నిఖిల్
రెడ్డి తుపాకితో బెదిరించాడు. దీంతో సదరు వ్యాపారవేత్త
బుధవారం పోలీసులను ఆశ్రయించారు. తన వద్ద డబ్బులు
తీసుకొని చీటింగ్ చేశాడని ఆయన నారాయణగూడ పోలీసు
స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు
నిఖిల్ రెడ్డి కోసం వేట కొనసాగించారు.
నిఖిల్ రెడ్డి పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.
కాగా
ఇటీవల పలువురు హీరోలు వివిధ కేసుల్లో పోలీసులకు
పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులోనూ
పలువురు హీరోలు బంజారాహిల్సులో పోలీసులకు పట్టుబడ్డారు.
నాలుగు
రోజుల క్రితం ఉద్యోగాలిప్పిస్తామని, సినీ అవకాశాలు ఇప్పిస్తామని
చెప్పి కొందరు యువతులను నమ్మించి నగరానికి రప్పించి బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్న తారా చౌదరి, ఆమె
సన్నిహితుడిని బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసి ఆదివారం రిమాండుకు
తరలించిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment