హైదరాబాద్:
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా
గురువారం హైదరాబాదులోని ఆయన విగ్రహానికి పలువురు
నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
బషీర్ బాగ్ చౌరస్తాలో ఉన్న
ఆయన విగ్రహానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఉదయం పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగ్జీవన్
రామ్ బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు.
ఆయనకు కేంద్రం భారత రత్న ఇవ్వాలని
డిమాండ్ చేశారు.
తిరుపతి
మాజీ శాసనసభ్యుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా జగ్జీవన్ రామ్
విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన
మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి
ఎంతో కృషి చేశారన్నారు. ఆయనకు
భారతరత్న ఇవ్వాలని తాను కేంద్రాన్ని కోరతానని
చెప్పారు.
ఆయనకు
భారతరత్న ఇవ్వడం న్యాయసమ్మతమైన డిమాండ్ అన్నారు. అలాంటి మహనీయుడికి తాను మనస్ఫూర్తిగా నివాళులు
అర్పిస్తున్నానని అన్నారు. నివాళులు అర్పించిన వారిలో మంత్రులు దానం నాగేందర్, శైలజానాథ్,
పొన్నాల లక్ష్మయ్య, డిప్యూటీ స్పీకర్ మళ్లూ భట్టి విక్రమార్క,
టిడిపి నేతలు వర్ల రామయ్య,
తీగల కృష్ణా రెడ్డి, ఎంపి అంజన్ కుమార్
యాదవ్ తదితరులు ఉన్నారు.
కాగా
జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా
పోలీసులు ఎల్బీ స్టేడియం వద్ద
ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలువురు ప్రముఖులు జగ్జీవన్ రామ్ కు నివాళులు
అర్పించేందుకు వస్తారు. ఇందు కోసం గట్టి
భద్రత కూడా ఏర్పాటు చేశారు.
0 comments:
Post a Comment