వ్యభిచారం
ముఠాను నడుపుతున్న ఆరోపణలపై అరెస్టయిన తెలుగు సినీ నటి తారా
చౌదరి వ్యవహారాలకు సంబంధించి దిమ్మ తిరిగి పోయే
విషయాలు బయటకు వస్తున్నాయి. తెలుగు
సమాజంలో ఆమె ఓ లేడీ
డాన్గా వ్యవహరించిట్లు బయట
పడుతున్న విషయాలు తెలియజేస్తున్నాయి. హత్యలకు కుట్ర చేసి, సుపారీలు
ఇవ్వడం నుంచి, పోలీసు అధికారులను కూడా బ్లాక్ మెయిల్
చేసే వరకు తనకు తిరిగే
లేదన్నట్లుగా ఆమె వ్యవహరించినట్లు టీవీ
చానెళ్ల వార్తాకథనాలను పరిశీలిస్తే అర్థమవుతోంది.
తారా
చౌదరికి సంబంధించిన పలు విషయాలపై తెలుగు
టీవీ చానెళ్లు వరుసగా వార్తాకథనాలను ప్రసారం చేస్తున్నాయి. ఆమె రాయలసీమలో ఫాక్షన్
రాజకీయాలను నడిపినట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తూ రాష్ట్రంలోని దేవాలయాల్లో వివిఐపి ట్రీట్మెంట్ పొందినట్లు సమాచారం.
ఆమె తరుచుగా ఒంగోలులోని అక్కమాంబ దేవాలయాన్ని సందర్శించేదట. అక్కడి ట్రస్టు సభ్యులు ఓ విడత ఆమెకు
వివిఐపి ట్రీట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించడంతో
ట్రస్టు సభ్యుడొకరిపై కక్ష గట్టినట్లు వార్తలు
వచ్చాయి.
ట్రస్టు
సభ్యుడితో గొడవ జరగడంతో ఉన్న
ఫలాన డిఎస్పీని ఒకరిని బ్లాక్ మెయిల్ చేసి తన వద్దకు
రప్పించుకుని ట్రస్టు సభ్యులపై కేసు పెట్టినట్లు చెబుతున్నారు.
అయితే, వారిని అరెస్టు చేయాలని ఆమె పట్టుబట్టిందని అంటున్నారు.
కేసు పెట్టగలం గానీ అరెస్టు చేయలేమని
పోలీసాఫీసరు చేతులెత్తేయడంతో ఆయన నుంచి లక్షలాది
రూపాయలు వసూలు చేసినట్లు వార్తాకథనాలు
వచ్చాయి.
తారా
చౌదరిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని
విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన విషయాలను మాత్రమే ప్రశ్నించామని, ఇతర విషయాలపై ప్రశ్నించలేదని
పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆమె ల్యాప్ టాప్ను కూడా ఓపెన్
చేయలేదని ఆయన చెప్పారు. ల్యాప్
టాప్ ఓపెన్ చేస్తే పలు
కీలక విషయాలు బయటపడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆమె డైరీ మాత్రం
పోలీసుల చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఓ వ్యక్తిని చంపించడానికి ఆమె హైదరాబాదులోని ఓ
ముఠాను కూడా నియోగించినట్లు ఆరోపణలు
వస్తున్నాయి. పని పూర్తి చేస్తే
లక్ష రూపాయలు ఇస్తానని ఆ ముఠాతో ఒప్పందం
కూడా కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయాలను తారా
చౌదరి తన డైరీలో రాసుకుందట.
ప్రముఖ దేవాలయాలకు దర్శనానికి వెళ్లినప్పుడు పోలీసులు రెడ్ కార్పెట్ వేయాల్సిన
పరిస్థితి ఉండేదట. మామూలు దేవాలయాల్లో అయితే గర్భగుడిలోకి వెళ్లి
పూజలు చేసేదట. ఇవన్నీ పోలీసాఫీసర్ల ఆదేశాల మేరకు జరిగేవని అంటున్నారు.
పోతే,
ఆమెకు హైదరాబాదులో ఓ పెద్ద గెస్ట్
హౌస్ ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో కోటిన్నర రూపాయల విలువ చేసే ఫ్లాట్
ఉన్నట్లు చెబుతున్నారు. శ్రీలక్ష్మి అనే అమ్మాయి ఆమె
చెర నుంచి తప్పించుకుని వచ్చి
మీడియాకు ఎక్కిన సమయంలో తారా చౌదరి అక్కడికే
పారిపోవడానికి తట్టా బుట్ట సర్దుకున్నట్లు
చెబుతున్నారు. ఈలోగా పోలీసుల ఆమెను
అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తన సొంత ప్రకాశం
జిల్లాలో ఆమెకు 20 ఎకరాల పొలం ఉన్నట్లు
చెబుతున్నారు.
పోలీసులు
తారా చౌదరిని, ఆమె భర్త ప్రసాద్ను విచారిస్తున్నారు. వారి
విచారణలో బడా బాబుల గుట్టు
కూడా రట్టు కావచ్చునని అంటున్నారు.
దీంతో చాలా మంది గుండెలు
అరచేతుల్లో పెట్టుకున్నారని టీవీ చానెళ్లు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఏమైనా, తారా చౌదరి లేడీ
డాన్గా అవతారమెత్తి ఓ
ఊపు ఊపినట్లు మాత్రం అర్థమవుతోందని అంటున్నారు.
0 comments:
Post a Comment