మాస్కో:
సైబీరియాలో ఘోర విమాన ప్రమాదం
జరిగింది. ఈ ప్రమాదం సైబీరియాలోని
ట్యూమెన్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో
సుమారు 32 మంది మృతి చెందినట్లుగా
సమాచారం. రెస్క్యూ టీంలు మరో పదికొండు
మందిని రక్షించారు. క్షతగాత్రులను వెంటనే ట్యూమెన్ ఆసుపత్రికి చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా
తరలించారు. పదకొండు మంది పరిస్థితి విషమంగా
ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ విమానంలో 39 మంది
ప్రయాణీకులు, నలుగురు ఉద్యోగులు ఉన్నారు.
ఈ ఘటన ట్యూమెన్ నగరంలో
టేకాఫ్ అయిన కొద్ది సేపటికే
జరిగింది. నగరం నుండి విమానం
కేవలం ముప్పై కిలోమీటర్లు ప్రయాణించింది. ఎయిర్ క్రాఫ్ట్ పేలి
మంటలు అంటుకొని ముక్కలైంది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని సుమారు
200 మంది రెస్క్యూ టీం అక్కడకు చేరుకొన్నారు.
సైబీరియాలోని సుర్గేట్ వైపు
వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
0 comments:
Post a Comment