హైదరాబాద్:
తెలంగాణ విషయంలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని,
అవసరమైతే తామే ప్రాణాలు ఇచ్చేందుకు
సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.కేశవ
రావు ఆదివారం అన్నారు. ఆత్మహత్యలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి అన్ని పార్టీలతో కలిసి
ఓ కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆదివారం
తన నివాసంలో కెకె మీడియాతో మాట్లాడారు.
ఆత్మహత్యలపై సభాపతి మనోహర్ చేసిన ప్రకటనలో తెలంగాణ
అనే పదాన్నే ప్రస్తావించలేదని విమర్శించారు. అది సరికాదన్నారు. రాంలీలా
మైదానంలో ఒక్క వ్యక్తి చనిపోతే
పార్లమెంటు మొత్తం ఊగిపోయిందన్నారు. కానీ, తెలంగాణ కోసం
700 మంది బిడ్డలు చనిపోతే స్పందించే బాధ్యత స్పీకర్కు లేదా అన్నారు.
తెలంగాణపై కేంద్రం త్వరలో ప్రకటన చేస్తుందంటూ ఎప్పటి నుంచో ఊదరగొడుతున్నారని, ఆ
త్వరలో అంటే ఎప్పుడని కెకె
ప్రశ్నించారు.
ప్యాకేజీలతో
పని లేదని, తెలంగాణ తప్ప దేనికీ అంగీకరించే
ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ అంశంపై తాము పార్లమెంటును స్తంభింపజేశామని,
అధికార పార్టీ ఒక అంశంపై పార్లమెంటును
స్తంభింపజేయడం చరిత్రలోనే లేదని పేర్కొన్నారు. ఉప
ఎన్నికల్లో ఓటమికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స
సత్యనారాయణలే బాధ్యత వహించాలన్నారు. రాజీనామా అనేది వారి ఇష్టమని
పేర్కొన్నారు. తెలంగాణ ఇస్తామని పార్టీ చెప్పి ఉంటే ఉప ఎన్నికల్లో
ఓడిపోయేది కాదని చెప్పారు. తెలంగాణపై
చిదంబరం వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనన్నారు. ప్రణబ్ కమిటీకి తెలుగుదేశం పార్టీ గతంలోనే లేఖ ఇచ్చిన సంగతి
ఆయన మరచిపోయారా? అని ప్రశ్నించారు. ఇంకా
పార్టీల అభిప్రాయమేంటని, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి అడ్డంకి ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్
తెలంగాణ ప్రాంత నేతలందరూ రెండు మూడు రోజుల్లో
సమావేశం కానున్నారని వెల్లడించారు.
0 comments:
Post a Comment