హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఇంట్లో పడక గది లేదా
అంటూ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం
చలోక్తులు విసిరారు. చంద్రబాబు తన గురించి చేసిన
వ్యాఖ్యలపై ఆయన గాంధీ భవన్లో ఆయన విలేకరులతో
మాట్లాడారు. చంద్రబాబు పదే పదే నా
గుండెల్లో నిద్రపోతాననడం ఎందుకని, ఆయన ఇంట్లో పడగ్గది
లేదా అని ఎద్దేవా చేశారు.
తన నివాసానికి వస్తానంటూ ఆయన సవాలు విసరడం
పైనా ఆయన స్పందించారు. తన
ఇంటికి రక్షణగా చాలామంది గన్మెన్ ఉన్నారని,
వారితో పాటు చంద్రబాబు కూడా
కాపలా కాయాల్సిన పనేముందని ప్రశ్నించారు. చంద్రబాబుకు అరవయ్యేళ్లు దాటాయాని విలేకరులు ప్రస్తావించగా.. అప్పుడే అరవై దాటాయా? పాపం
ఈ వయసులో ఆయన ఎండలో గంటలకొద్దీ
నిలబడటం మంచిది కాదని బొత్సజాలి ప్రదర్శించారు.
కాగా
బొత్స సత్యనారాయణపై చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారని విజయనగరాన్ని స్తంభింపజేసిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండి రూ.లక్ష
కోట్లు అక్రమంగా సంపాదించుకున్న జగన్ సోనియా పైనా,
రాహుల్ పైనా చేస్తున్న విమర్శలను
ఎందుకు పట్టించుకోవట్లేదని పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు
ప్రశ్నించారు.
గతంలో
చంద్రబాబు, జగన్ ఎన్నో ధర్నాలు,
పర్యటనలు చేశారని.. అప్పట్లో వారిని అడ్డుకోని కాంగ్రెస్ యంత్రాంగం చంద్రబాబు విజయనగరం పర్యటన సందర్భంగా ఎందుకు ఎదురుదాడి చేసిందని ప్రశ్నించారు. వైఎస్ విగ్రహాలను వేలాదిగా
ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తోందని ప్రశ్నించారు.
0 comments:
Post a Comment