హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు
సిపిఎం మళ్లీ షాక్ ఇచ్చింది.
త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో తాము
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని సిపిఎం రాష్ట్ర
కార్యదర్శి రాఘవులు గురువారం స్పష్టం చేశారు. తాము ఉప ఎన్నికలలో
పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చామని చెప్పారు. తమకు తెలుగుదేశం పార్టీ
పైన కోపం గానీ లేదంటే
ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా
చంద్రబాబు నాయుడు పైన ద్వేషం కానీ
లేదన్నారు.
పొత్తుల
ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుందనుకుంటేనే తాము ఎన్నికలలో సర్దుబాటు
చేసుకుంటామని చెప్పారు. ఉప ఎన్నికలలో సిపిఐతో
కలిసి పోటీ చేసే విషయమై
చర్చిస్తున్నట్టు చెప్పారు. సిపిఐ, సిపిఎంలు ఎప్పుడూ ప్రజల కోసమే ఉంటాయన్నారు.
భిన్న పార్టీలతో కాకుండా సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి వెళ్లే ఉద్దేశ్యంతో
సిపిఐతో చర్చిస్తున్నట్లు చెప్పారు.
తాము
అనంతపురం, తిరుపతి, పాయకరావుపేట, ఒంగోలు, పోలవరం తదితర నియోజకవర్గాలలో పోటీ
చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నామని చెప్పారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఆ పార్టీని
పట్టించుకోవడానికి వచ్చినట్టుగా లేదని, ఆ పార్టీలోని ముఠా
తగాదాలను పరిష్కరించేందుకు వచ్చినట్లుగా ఉందని విమర్శించారు. ఉప
ఎన్నికలలో తాము గెలుస్తామని భావించే
చోట పోటీ చేస్తామని చెప్పారు.
వాయలార్
రాష్ట్ర పర్యటనకు ఎందుకు వచ్చారో తెలియదన్నారు. కాగా ఇటీవల జరిగిన
ఉప ఎన్నికలలోనూ సిపిఎం చంద్రబాబుకు చేయిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలోని
ఆరు, సీమాంధ్రలోని కొవూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగిన
విషయం తెలిసిందే. ఆ ఎన్నికలలో సిపిఎం
స్టేషన్ ఘనపూర్, కొవూరులలో పోటీ చేసి తెలుగుదేశం
పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది.
0 comments:
Post a Comment