తెలుగుదేశం
పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా
చంద్రబాబు నాయుడు తన బావమరిది, సినీ
హీరో బాలకృష్ణ చెప్పిన దానికి సరే అన్నారట. విషయానికి
వస్తే.. అనంతపురం నియోజకవర్గంపై చంద్రబాబు తీవ్ర తర్జన భర్జన
పడుతున్న విషయం తెలిసిందే. ఆ
స్థానంలో టిక్కెట్ను ఎవరికి ఇవ్వాలో
తేల్చుకోలేక ఆయన సతమతమవుతున్నారనే వార్తలు
వచ్చిన విషయం తెలిసిందే. అనంతపురం
నియోజకవర్గంలో టిడిపి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
దీంతో
ఆ స్థానం కోసం మహాలక్ష్మి శ్రీనివాస్,
వై.ప్రభాకర్ చౌదరి పోటీ పోటీగా
టిక్కెట్ కోసం తమ వంతు
ప్రయత్నాలు చేశారు. ఆ రెండు వర్గాలు
ఎవరికి వారే తమకు సీటు
ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు వచ్చారట. దీంతో ఎటూ తేల్చుకోలేక
చంద్రబాబు ఓ సమయంలో ఆ
సీటును మనలో ఎవరికీ కాకుండా
సిపిఐతో పొత్తు పెట్టుకుంటే వారికి ఇచ్చేద్దామని వారికి సూచించారట. పొత్తు ఉన్నా లేకున్నా తమకంటే
తమకు అని వారు బాబును
అడుగుతున్నారు.
అదే సమయంలో మాజీ మంత్రి, తెలుగుదేశం
పార్టీ నేత పరిటాల రవి
అనుచరుడు చమన్ పేరు కూడా
తెర పైకి వచ్చిందట. మహాలక్ష్మి
శ్రీనివాస్కు టిక్కెట్ ఇవ్వాలని
లేదంటే తాము సూచించిన చమన్కు ఇవ్వాలని జిల్లాకు
చెందిన కొందరు నేతలు బాబును అడిగారట.
దీంతో బాబు ఎటూ తేల్చుకోలేకపోయారట.
అయితే ఇదే సమయంలో మహాలక్ష్మి
శ్రీనివాస్ బాలకృష్ణను కలిశారట.
మహాలక్ష్మి
శ్రీనివాస్ బాలయ్య ముందు తన ఆవేదన
వ్యక్తం చేయడంతో, బాలయ్య వెంటనే చంద్రబాబుకు ఫోన్ చేసి అనంత
టిక్కెట్ను శ్రీనివాస్కు
ఇవ్వాలని సూచించారట. బాలయ్య గట్టిగా పట్టుబట్టడంతో చంద్రబాబు శ్రీనివాస్కే ఓటు వేయక
తప్పలేదట. ఆయన పేరును అధికారికంగా
ఇప్పటి వరకు ప్రకటించక పోయినప్పటికీ
20వ తేదిన ప్రకటించే అవకాశముందని
అంటున్నారు.
2009 సాధారణ
ఎన్నికలలో శ్రీనివాస్ అనంతపురం నుంచి పోటీ చేసి
ఓడిపోయారు. కాగా మాచర్ల అభ్యర్థిని
కూడా చంద్రబాబు బాలయ్య సూచనల మేరకే ఖరారు
చేశారని అంటున్నారు. అక్కడ నుండి చిరుమామిళ్ల
మధు పోటీ చేసే అవకాశాలు
ఉన్నాయని తెలుస్తోంది.
0 comments:
Post a Comment