యంగ్
టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దమ్ము’ చిత్రం యూకె రైట్స్ రూ.
20 లక్షలకు విసు ఎంటర్ టైన్మెంట్స్
సొంతం చేసుకుంది. మరీ ఇంత తక్కువ
రేటుకు అమ్ముడు పోవడం ఏమిటి? అని
అశ్యపోకండి. ఎందుకంటే యూఎస్తో పోలిస్తే
యూకెలో ఉండే తెలుగు జనాలు
చాలా తక్కువ. తెలుగు సినిమాలు ప్రదర్శింపబడే థియేటర్లు కూడా వేళ్ల మీద
లెక్కపెట్టొచ్చు. అందుకే అక్కడ ఈ మొత్తానికి
అమ్ముడో పోవడం అంటే చాలా
ఎక్కువే.
బోయపాటి
శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రాన్ని అలెగ్జాండర్ కె.వల్లభ కెఎస్
రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బేనర్పై నిర్మించారు.
ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక
నటించారు. కీరవాణి సంగీతం అందించారు. ఏప్రిల్ 27న ఈచిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేసేందుకు
సన్నాహాలు చేస్తున్నారు.
దమ్ము
సినిమా సినిమా పల్లెటూరు నేపథ్యంలో ఉంటుందని, ఎన్టీఆర్ సింహాద్రి లెవల్ లో విజృంభించబోతున్నట్లు
వినికిడి. సినిమాలో యంగ్ టైగర్ డ్యూయల్
రోల్ ఇన్ సింగిల్ కారెక్టర్
గా రాబోతున్నట్లు చెపుతున్నారు. రెండిటిలో ఒక భాగం మాస్
ను ఒక భాగం క్లాస్
ను ఆకట్టుకుంటుందట.
దాదాపు
7 సంవత్సరాల తరువాత జూనియర్ కెరీర్ లో పూర్తి స్తాయి
మాస్-మసాలా-కామెడీ-యాక్షన్
చిత్రంగా పేరుకి తగ్గట్టుగానే దమ్ము రాబోతుందని ఇండస్ట్రీ
వర్గాల టాక్. సెన్సార్ టాక్
ప్రకారం ఈ సినిమా ఎబో
ఎవరేజ్ అనీ , తప్పక హిట్
అవుతుందనీ అంటున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సింహా తరువాత
నందమూరి అభిమానులకు మరో హిట్ రాబోతుందని
సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
0 comments:
Post a Comment