మత్తు
ఎక్కే వైన్ తాగాలన్నా, కొవ్వు
పట్టే ఛీజ్ తినాలన్నా ఫ్రెంచి
మహిళలు పెట్టింది పేరు. మరి అంత
తాగి, తిని కూడా వారు
ఎంతో సన్నగా నాజూకుగా వుంటారంటే మన మహిళలకు తప్పక
అసూయే. అసలు ఫ్రెంచి వనితలు
తినే ఆహారం ఏమిటనేది ప్రపంచంలో
అందరికి తెలిసిందే. వారి నాజూకు రహస్యం
ఆహారాలలో లేదు వారి తినే
విధానంలో వుంది. ఫ్రెంచి ఆహారాలు మీరు కూడా తినేస్తే
సన్నపడరు. ఆహారం ఏదైనప్పటికి తినే
విధానం ప్రధానం అంటున్నారు పోషకాహార నిపుణులు.
1. ఫ్రెంచి
మహిళలు ప్రపంచంలోని కొవ్వు పట్టే ఆహారాలన్ని తింటారు.
వారి ఆహారంలో ఛీజ్, వైన్ తప్పక
వుండాల్సిందే. అయినప్పటికి వారు సన్నగా నాజూకుగా
వుంటారు.
2. వారు
ఎంత తింటారు? ఫ్రెంచి మహిళలు ఎపుడు తిన్నా ఛీజ్
ఒక్క పీస్ మాత్రమే తింటారు.
మనవలే ఒక్కసారి తిన్నా అధికంగా తినటం, అనేక మార్లు తిన్నా
తక్కువగా తినటం వంటివి చేయరు.
3. వారి
ఫ్యాటీ ఆహారం కూడా ఆరోగ్యమే
దానికి కారణం వారు తినేది
సహజమైన ఆహారం మంచి పోషక
విలువలు కలిగినది తింటారు. జంక్ ఫుడ్ తినరు.
సహజ ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ వుండవు.
4. బరువు
తగ్గాలంటూ ఆహారం నిరాకరిస్తేతినాలనే కోరిక చచ్చిపోతుంది.
డైటింగ్ ప్రభావం కనపడదు. మంచి ఆహారాలు తినాలి.
అయితే కొద్దిగా తినండి. కేలరీలు చేర్చకండి.
5. తినటమే
కాదు, ఫ్రెంచి వనితల జీవనవిధానం కూడా
ఆచరించాలి. కొద్ది దూరాలకు వారు వాహనాలు వాడరు.
నడక, ఆఫీసులలో మెట్లు ఎక్కడం వంటివి వారు ఆచరిస్తారు. ప్రతిదినం
చేసే పనులలోనే వారు వ్యాయామాలను కూడా
ఆచరించి శరీరాన్ని మంచి రూపంలో వుంచుకొంటారు.
కనుక
ఫ్రెంచి ఆహారం ఎపుడు తిన్నప్పటికి
తినే విధానం కారణంగా అది మిమ్మల్ని మంచి
శారీరక రూపంలో వుంచుతుంది.
0 comments:
Post a Comment