న్యూఢిల్లీ:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయం సెంట్రల్ బ్యూరో
ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)ని అడగండని
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సోమవారం న్యూఢిల్లీలో మీడియాతో అన్నారు. ఆదివారం ఢిల్లీ వెళ్లిన గవర్నర్ బిజీ బజీగా ఉన్నారు.
సోమవారం ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు
సోనియా గాంధీ, కేంద్ర మంత్రి చిదంబరం, ఆంటోనీలతో భేటీ అయ్యారు.
అనంతరం
ఆయనను మీడియా పలకరించింది. జగన్ అరెస్టుపై సిబిఐనే
అడగాలని ఆయన చెప్పారు. అది
సిబిఐ పరిధిలోని అంశం అని చెప్పారు.
తెలంగాణపై తాను చిదంబరానికి, ఆంటోనికి
ఎలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. పార్టీ పెద్దలను కలిసినప్పుడు తన పదవి పొడిగింపు
విషయమై చర్చకు రాలేదని చెప్పారు. తన పదవిని పొడిగిస్తారో
లేదో తనకు తెలియదని చెప్పారు.
భూకేటాయింపులలో
అక్రమాలు తన దృష్టికి రాలేదని
ఆయన చెప్పారు. రాష్ట్రంలో త్వరలో ఉప సంచాలకుల నియామం
ఉంటుందని చెప్పారు. తాను సంతోషంగానే ఉన్నానని
చెప్పారు. హైదరాబాదులోని పాతబస్తీలో ఆదివారం స్వల్ప సంఘటన జరిగిందని, దానిని
అదుపులోకి తీసుకు వచ్చారని చెప్పారు. ప్రస్తుతం పాతబస్తీలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని అంతా బాగానే
ఉందని చెప్పారు.
ఏఐసిసి
అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఏం మాట్లాడానో తాను
చెప్పలేనని తెలిపారు. కాగా సాయంత్రం గం.5.15
నిమిషాలకు గవర్నర్ నరసింహన్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో భేటీ
కానున్నారు. సాయంత్రం మరోసారి ఎకె ఆంటోనీతో భేటీ
కానున్నారు. కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ను మంగళవారం కలవనున్నారు.
0 comments:
Post a Comment