యువ హీరోలపై సీనియర్ నటీమణులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటే సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ మాటలు వినాల్సిందే.
సినీ రంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ సూటిగా,
నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి జయసుధ అనే విషయం
బయటి ప్రపంచానికి ఇటీవలే అర్థమవుతోంది. అక్కినేని నాగేశ్వర రావు 75 వసంతాల సినీ జీవిత సత్కారం
సభలో ఆమె మాట్లాడారు. ఈ
ప్రసంగంలో ఆమె యువ హీరోల
సిక్స్ ప్యాక్పై సీరియస్గానే
సెటైర్లు వేశారు.
సిక్స్
ప్యాక్ అందమని అనుకుంటున్నారని అంటూ సినీ హీరోల్లో
అక్కినేనిని మించిన అందగాడు లేడని కితాబు ఇచ్చారు.
అక్కినేని నాగేశ్వర రావు నడిచి వస్తుంటే
ఆ అందమేమిటో తెలుస్తుందని ఆమె అన్నారు. నిజానికి,
మన యువ హీరోలు సిక్స్
ప్యాక్తో అదరగొట్టాలని అనుకుంటున్నారు
గానీ మనసులు దోచుకోవడానికి ప్రయత్నించడం లేదని జయసుధ మాటలను
బట్టి అర్థమవుతోంది. ఓ హీరోయిన్‌గా,
ఓ మహిళగా ఆమె చెప్పిన మాటలు
ఎంత అర్థమైనవో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భావించక
తప్పదు.
ఇక, జయసుధ మరో వ్యాఖ్య
కూడా చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి
కారణంగా రాజకీయాల్లోకి వచ్చి వాటి లోగుట్టు
ఏమిటో ఆమె తెలుసుకున్నారు. అందుకే
రాజకీయాలపై ఆమె తరుచూ వైరాగ్యం
ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ సభలోనూ ఆమె
అదే వైరాగ్య దృష్టితో మాట్లాడారు. అక్కినేని నుంచి తాను చాలా
విషయాలు నేర్చుకున్నాను గానీ రాజకీయాల్లోకి రాకూడదనే
విషయం నేర్చుకోలేకపోయానని ఆమె అన్నారు.
ఇకపోతే,
అక్కినేని నాగేశ్వర రావు సినీ రంగంలో
సచిన్ క్రికెట్లో వంద సెంచరీలు
పూర్తి చేసినట్లు వందేళ్లు పూర్తి చేయాలని మెగాస్టార్, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి ఆశించారు. అక్కినేని నాగేశ్వర రావును జీవితాన్ని చదివిన వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. అక్కినేని
నాగేశ్వర రావు 64 మంది హీరోయిన్లతో నటించారని
టి. సుబ్బిరామి రెడ్డి గుర్తు చేశారు.
తెలుగు
సినిమాకు ఎన్టీఆర్, ఎఎన్నార్ రెండు కళ్లు అని,
కన్ను పోయిందని, మరో కన్ను వందేళ్లు
సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని ప్రముఖ సినీ నటుడు మోహన్
బాబు అన్నారు. అక్కినేనికి సోమవారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
చేతుల మీదుగా సత్కారం జరిగింది.
0 comments:
Post a Comment