న్యూఢిల్లీ:
పార్టీల కామన్ సింబల్ పైన
సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది.
ఈ అంశంలో సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసి) నిర్ణయాలను
సమర్థించింది. కామన్ సింబల్ విషయంలో
ఈసిదే తుది నిర్ణయమని సుప్రీం
తేల్చి చెప్పింది. 2009 సాధారణ ఎన్నికలకు ముందు తమకు కామన్
సింబల్ కేటాయించాలన్న పలు పార్టీల విజ్ఞప్తిని
ఈసి తోసిపుచ్చింది.
దీంతో
అప్పటి చిరంజీవి ఆధ్వర్యంలోని ప్రజారాజ్యం, జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలోని లోక్సత్తా, తమిళనాడులోని
విజయకాంత్ ఆధ్వర్యంలోని డిఎండికె పార్టీలు ఈసి నిర్ణయాన్ని సవాల్
చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాయి. (ఇప్పుడు చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని
కాంగ్రెసులో విలీనం చేశారు) ఈ కేసులో కోర్టు
బుధవారం కీలక తీర్పు వెలువర్చింది.
పిఆర్పీ, లోక్సత్తా, డిఎండికె
పిటిషన్లను కోర్టు తోసి పుచ్చింది.
గుర్తింపు
పొందిన పార్టీలకే ఎన్నికలలో శాశ్వత చిహ్నం కేటాయిస్తామని ఈసి అప్పుడు ఆ
పార్టీలకు తెలిపింది. తాజాగా కోర్టు తన తీర్పులో పార్టీలకు
నిబంధనల ప్రకారమే గుర్తులు కేటాయించాలని సూచించింది. పిటిషన్లను కొట్టివేసింది. కాగా ఈసికి అనుకూలంగా
జస్డిస్ ఎస్ఎస్ నిజ్జార్, జస్టిస్ అల్తమాస్ కబీర్ తీర్పునిచ్చారు.
అయితే
ఆర్టికల్-14ను ఈసి ఉల్లంఘిస్తుందన్న
జస్టిస్ చలమేశ్వర్ జడ్జిల తీర్పుతో విభేదించి చట్టం అందరికీ సమానమేనన్నారు.
కామన్ సింబల్ పైన సుప్రీం కోర్టు
ఈ రోజు కీలక తీర్పు
ఇవ్వడంతో 2008లో దాఖలైన పిటిషన్లపై తెర పడినట్లయింది.
కాగా ఎన్నికల నియమావళి ప్రకారం పార్టీకి కామన్ సింబల్ రావాలంటే
ఒక పార్లమెంటు సభ్యుడు, ఇద్దరు శాసనసభ్యులు ఆ పార్టీకి ఉండాలి.
లేదా ఓట్ల శాతం ఉండాలి.
0 comments:
Post a Comment