సినిమాల్లో
శృంగారం లాభాలు తెచ్చి పెడుతుందనేది నిర్మాతల గట్టి నమ్మకం. అందులో
వాస్తవం కూడా ఉంది. వ్యభిచారం
రాకెట్ కేసులో అరెస్టయిన తారా చౌదరి ఉదంతాన్ని
తీసుకుని సినిమాలు తీయాలని పలువురు భావిస్తున్నారంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పైగా, పలు టైటిళ్లు
కూడా చెలామణిలో ఉన్నాయి. ఇప్పటికే ఒక తార.. చంద్రలెందరో
పేరుతో ఎపి ఫిల్మ్ ఛాంబర్
ఆఫ్ కామర్స్లో ఓ టైటిల్
రిజిష్టరైంది. తారా చౌదరి జీవితంపై
సినిమా అనే అర్థం వచ్చేలా
ఆ టైటిల్ ఉందని అంటున్నారు.
తారా
చౌదరిపై సినిమా తీస్తే హాట్గా పోతుందని
అనుకుంటున్నారు కావచ్చు, నిర్మాతుల తారా జువ్వ, తారా
తోరణం, ఒంపుసొంపుల వయ్యారి, కెమెరా రాణి వంటి టైటిళ్లను
తమ సినిమాలకు పెట్టుకోవడానికి ఆలోచన చేస్తున్నారంటూ వార్తలు
వస్తున్నాయి. అయితే ఈ టైటిళ్లేవీ
రిజిష్టర్ కాలేదని తెలుస్తోంది. అయితే, టాలీవుడ్లో మాత్రం ఆ
పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. గత మేలో తొమ్మిది
తారలు అనే టైటిల్ రిజిష్టర్
అయినట్లు తెలుస్తోంది. అయితే, తారా చౌదరి ఉదంతంతో
దీనికి సంబంధం లేదని ఓ ఆంగ్ల
దినపత్రిక రాసింది.
తారా
చౌదరి అరెస్టుతో పలువురు ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తారా చౌదరి ఆపరేషన్
ఉత్కంఠ కలిగించే విధంగా ఉంది. పెన్ కెమెరాలతో
రాసలీలలను చిత్రీకరించడం, వారిని బ్లాక్ మెయిల్ చేయడం, అమ్మాయిలను సరఫరా చేయడం, పోన్లలో
ప్రముఖులతో మత్తెక్కించే విధంగా సంభాషించడం వంటి విషయాలను సినిమాలకు
మంచి మసాలాను అందిస్తాయని అంటున్నారు. పైగా, దీంట్లో ఓ
లేడీ డాన్ అంశ కూడా
ఉంది. మాస్ మసాలా సినిమాకు,
లేడీ ఓరియెంటెడ్ సినిమాకు తారా చౌదరి కథ
పనికి వస్తుందని అనుకుంటున్నారట.
పైగా,
కుగ్రామం నుంచి హీరోయిన్ కావాలని
వచ్చి ఆశలు ఆడుగంటి పంకిలంలోకి
ఎలా దిగజారిందేనే విషయాన్ని కథగా తీసుకుంటే ప్రజలు
ఆదరిస్తారని కూడా అంటున్నారు. రాక్షసుడు,
లవ్ టికెట్, ప్రియసఖి వంటి సినిమాల్లో చిన్నపాటి
పాత్రలు వేసి, కలలు కరిగిపోగా,
ఆమె మురికి కూపంలో పడిందనే కథావస్తువు బాగా పండుతుందని కూడా
అంటున్నారు.
అయితే,
ఏ వ్యక్తుల మీదనైనా సినిమాలు తీయాలంటే వారి అనుమతి అవసరం.
తనపై సినిమా తీసేందుకు తారా చౌదరి అనుమతి
ఇస్తుందా అనేది ప్రశ్న. సిల్క్
స్మిత జీవితంపై డర్టీ పిక్చర్ సినిమా
తీస్తున్నట్లు వార్తలు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు
తీవ్ర అభ్యంతరం చెప్పారు. దాంతో అది సిల్క్
స్మిత జీవితం కాదని ఫిల్మ్ మేకర్స్
కొట్టిపారేశారు.
0 comments:
Post a Comment