టాటా
నానో డీజిల్ మార్కెట్లోకి రావటానికి మరెంతో కాలం పట్టేలా లేదు.
అయితే, ముందుగా నానో సిఎన్జి
వేరియంట్ మార్కెట్లోకి వస్తుందా లేక డీజిల్ వేరియంట్
మార్కెట్లోకి వస్తుందా అనేదాని పైనే సంశయం నెలకొని
ఉంది. గడచిన జనవరిలో ఢిల్లీలో
జరిగిన ఆటో ఎక్స్పోలో
టాటా మోటార్స్ ఓ సిఎన్జి
వేరియంట్ టాటా నానో కారును
ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
అలాగే,
టాటా నానోలో డీజిల్ వేరియంట్ను అభివృద్ధి చేయటాన్ని
కూడా టాటా మోటార్స్ పూర్తి
చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డీజిల్ వేరియంట్ నానో కారును టాటా
మోటార్స్ ట్రైల్ రన్ నిర్వహిస్తోంది. మరోవైపు
సిఎన్జి వేరియంట్ నానో
ఉత్పత్తిని కూడా టాటా మోటార్స్
చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం
చివరి నాటికి నానో సిఎన్జి
ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు.
కాగా,
తాజా నివేదికల ప్రకారం 2013 సంవత్సరాని కంటే ముందుగానే నానోలో
డీజిల్ వేరియంట్ను టాటా మోటార్స్
ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా
నేలవైపు ఉన్న నానో అమ్మకాలు
ఆకాశం వైపుకు పరుగులు పెడుతుండటంతో ఈ మోడల్ అమ్మకాలను
మరింత పెంచుకునేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.
టాటా
నానో డీజిల్ కారు ధర, ప్రస్తుతం
లభిస్తున్న పెట్రోల్ కారు ధర కన్నా
30 శాతం అధికంగా ఉండొచ్చని అంచనా. ఈ ఏడాది చివరి
నాటికి నానో డీజిల్ ఉత్పత్తి
ప్రారంభం కానుంది. నానో డీజిల్లో
ట్విన్-సిలిండర్ 700-800 డైకర్ ఇంజన్ (టాటా
ఏస్లో ఉపయోగించినది)ను
ఉపయోగించవచ్చని అంచనా.

0 comments:
Post a Comment