హైదరాబాద్:
త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానంలో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి హవానే కొనసాగే అవకాశముందని
అంటున్నారు. గత సంవత్సరం డిసెంబరు
నెలలో కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడంతో పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయిన విషయం
తెలిసిందే. ఆ తర్వాత చిరంజీవి
రాజీనామా చేయడంతో తిరుపతి, మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామాతో నెల్లూరు పార్లమెంటు స్థానం ఖాళీ అయింది. ఈ
నియోజకవర్గాలలో రాష్ట్రపతి ఎన్నికల కంటే ముందే ఎన్నికలు
నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
ఇప్పటికే
గత ఉప ఎన్నికలలో చావు
దెబ్బ తిన్న కాంగ్రెసు పార్టీకి
ఈ ఎన్నికలలోనూ కోలుకోలేని పరిస్థితియే ఉంటుందని అంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో
తెలంగాణ సెంటిమెంట్ కారణంగా ఓడిపోతే ఈ ఎన్నికలలో దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
సెంటిమెంట్తో కాంగ్రెసు వెనుకబడే
అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైయస్ ఇమేజ్ వైయస్
జగన్మోహన్ రెడ్డికే కలిసి వస్తుందని, కాంగ్రెసు
పార్టీకి కలిసి రాదని చెబుతున్నారు.
పలు సర్వేలలో కూడా వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ ముందంజలో ఉండగా, తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత స్థానంలో
ఉంది. కాంగ్రెసు మూడో స్థానానికి పడిపోయింది.
నెల్లూరు లోకసభను జగన్ పార్టీయే కైవసం
చేసుకోనుందని చెబుతున్నారు. అలాగే పద్దెనిమిది అసెంబ్లీ
నియోజకవర్గాలలోనూ మెజార్టీ స్థానాలు వైయస్సార్సీవే అంటున్నారు. టిడిపి మూడు నుండి ఐదు,
కాంగ్రెసు కేవలం రెండు, మూడు
స్థానాలలో మాత్రమే గెలిచే అవకాశముందని చెబుతున్నారు.
జగన్
పార్టీ తరఫున రాజీనామా చేసిన
అభ్యర్థులే (రాయదుర్గం మినహా) బరిలో నిలవనున్నారు. తెలుగుదేశం
పార్టీ అభ్యర్థుల ముందస్తు ప్రణాళికతో వెళుతోంది. ఈ కారణాలు ఆ
రెండు పార్టీలకు కలిసి వస్తుందనే చెప్పవచ్చు.
అదే సమయంలో కాంగ్రెసు మాత్రం తన అభ్యర్థుల విషయంలో
తర్జన భర్జన పడుతోంది. కొన్నిచోట్ల
పోటీకి సిద్ధమౌతున్న వాళ్లలో గెలిస్తారా అనే అనుమానం, మరికొన్ని
చోట్ల టిక్కెట్ కోసం పోటా పోటీ
తదితర అంశాలు పార్టీని మరింత దెబ్బతీసే అవకాశముందని
అంటున్నారు.
ఈ ఉప ఎన్నికలు కాంగ్రెసు
పార్టీకి ప్రతిష్టాత్మకం కాబట్టి అధిష్టానమే ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ ఎన్నికలలో కాంగ్రెసు
ఓడిపోతే పార్టీ ఖాళీ అవుతుందని ఆ
పార్టీ నేతలే చెబుతున్నారు. జగన్
పార్టీ వైపు క్యూ కడతారని
హెచ్చరిస్తున్నారు. అలాగే వైయస్పై
ఆరోపణలు చేసే అంశం కూడా
పార్టీని గందరగోళంలోకి నెట్టి పార్టీకి నష్టపరుస్తుందన్న వారు ఉన్నారు.
మిగిలిన
పదిహేడు స్థానాలు కాంగ్రెసువే అయినప్పటికీ వారు జగన్ వైపు
వెళ్లడంతో ఉప ఎన్నికలు వస్తున్నాయి.
ఆయా స్థానాలలో మెజార్టీ స్థానాలు మళ్లీ రాజీనామాలు చేసిన
వారే దక్కించుకోనున్నారని అంటున్నారు. అయితే ఇటీవలి వరకు
చిరంజీవి ప్రాతినిధ్యం వహించిన తిరుపతి స్థానం కూడా జగన్ ఖాతాలోకే
వెళ్లనుందని అంటున్నారు. చిరంజీవి ఆ స్థానాన్ని ఎంత
ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ పార్టీ గెలిచే అవకాశాలు తక్కువే అని చెబుతున్నారు.
0 comments:
Post a Comment