హైదరాబాద్:
రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి
జరిగే ఉప ఎన్నికల వ్యూహరచనపై
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తన
పార్టీ నాయకులతో మంగళవారం చర్చలు జరిపారు. హైదరాబాదులోని లోటస్పాండు సమీపంలో
గల తన నివాసంలో ఆయన
పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాజా
మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, పన్నెల్లి రామకృష్ణా రెడ్డి, శ్రీనివాసులు, చెన్నకేశవ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో ప్రచార
కార్యక్రమాల ఖరారుపై వారు చర్చించారు. ఏయే
నియోజకవర్గాల్లో ఎప్పుడు పర్యటించాలనే విషయంపై వారు చర్చించి జగన్
పర్యటనకు రూప్ మ్యాప్ను
సిద్దం చేసినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల్లో వీలైనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించడం వల్లనే విజయావకాశాలు పెరుగుతాయని వారు భావిస్తున్నారు. వైయస్
జగన్ నియోజకవర్గాల్లో ఎంత ఎక్కువగా తిరిగితే
అంత మంచిదనే అభిప్రాయం వ్యక్తమైంది.
జగన్
ఇప్పటికే గుంటూరు జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఓదార్పు యాత్రల పేరుతో ఆయన ఎన్నికల ప్రచారమే
నిర్వహించారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో
ఆయన నర్సన్నపేటలో పర్యటించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఇతర
నియోజకవర్గాల పర్యటనపై దృష్టి పెడతారని అంటున్నారు. సంగారెడ్డిలోని మతఘర్షణల బాధితులను జగన్ సోమవారం పరామర్సించి
హైదరాబాద్ వచ్చారు.
వైయస్
జగన్ దూకుడును చూసి పిసిసి అధ్యక్షుడు
బొత్స సత్యనారాయణ కూడా ఎన్నికల ప్రచారం
సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాదులో ఉప ఎన్నికలపై సమీక్షా
సమావేశాలు నిర్వహిస్తుంటే ఆయన జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా పర్యటనను ముగించుకున్న బొత్స మంగళవారం వైయస్
జగన్ సొంత జిల్లా కడపలో
పర్యటించారు. వైయస్ జగన్పై
ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ
ప్రచారాన్ని సాగించారు. జగన్ స్వార్థం వల్లనే
ఉప ఎన్నికలు వచ్చాయని ఆయన తప్పు పట్టారు.
కాగా,
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
కూడా ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెట్టారు. ఆయన
తిరుపతి నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు.
అయితే, తమ పార్టీ నాయకుడు
ముద్దసాని దామోదర్ రెడ్డి అంత్యక్రియలకు హాజరు కావాల్సి రావడంతో
బ్రేక్ ఇచ్చారు. ఆయన ఈ నెల
13వ తేదీన నర్సన్నపేటలో పర్యటిస్తారు.
ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వెలుడక ముందే వేడి రాజుకుంది.
0 comments:
Post a Comment