శ్రీకాకుళం:
రాష్ట్రంలోని పాలన అంతా ఢిల్లీ
కేంద్రంగా రిమోట్ ద్వారా సాగుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం అన్నారు. వైయస్ జగన్ శ్రీకాకుళం
జిల్లాలోని నరసన్నపేటలో మాజీ శాసనసభ్యుడు ధర్మాన
కృష్ణదాస్ తరఫున ప్రచారం నిర్వహించారు.
నియోజకవర్గంలోని చెన్నపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో
జగన్ కాంగ్రెసుపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన
మరోసారి సోనియా గాంధీని టార్గెట్ చేసుకొని మాట్లాడారు.
దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
మరణానంతరం ఆయన ప్రవేశ పెట్టిన
పలు పథకాలను కాంగ్రెసు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని తుంగలో
తొక్కిందన్నారు. రైతుల కోసం పదవిని
త్యాగం చేసిన కృష్ణదాసుకు ఓటు
వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
త్వరలో
జరగబోయే ఉప ఎన్నికలలో మీ
ఆత్మసాక్షిగా ఓటెయ్యాలని జగన్ పిలుపునిచ్చారు. మీరు
వేసే ఓటు రాబోయే కొత్త
శకానికి నాంది పలుకబోతుందన్నారు. ఆరోగ్యశ్రీ
నుంచి 135 వ్యాధులను కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వం తొలగించిందని ఆయన ఆవేదన వ్యక్తం
చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి
మరణం తర్వాత ఒక్క కొత్త ఇల్లు
కూడా కట్టించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
కాగా
నరసన్నపేటలో జగన్ ఉప ఎన్నికల
ప్రచారం శుక్రవారం నుండే కొనసాగాల్సి ఉండగా
కొన్ని కారణాల వల్ల ఈ రోజు
నుండి ప్రారంభమైంది. ఉప ఎన్నికలు జరగనున్న
ఆయా నియోజకవర్గాలలో ఆయన వరుస పర్యటనలు
జరపనున్నారు. వరుసగా నెల రోజుల పాటు
ప్రచార పర్వంలో బిజీ బిజీగా ఉంటారు.
కాగా
రానున్న ఉప ఎన్నికలలో తాము
ఘన విజయం సాధిస్తామని పార్టీ
నేత కొణతాల రామకృష్ణ విశాఖపట్నంలో అన్నారు. ఈ ఎన్నికలను వైయస్
రాజశేఖర రెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి మధ్య జరుగుతున్న పోటీగా
ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పారు.
0 comments:
Post a Comment