బాలకృష్ణ
తాజా చిత్రం 'అధినాయకుడు'ఈ రోజే ప్రపంచమంతటా
భారీ ఎత్తున విడుదలైంది. సమరసింహా రెడ్డి,నరసింహనాయుడు తరహాలో భారి యాక్షన్ ఎలిమెంట్స్
తో ప్రస్తుత రాజకీయాలను కలుపుతూ తెరకెక్కిన ఈ చిత్రం బాలకృష్ణ
వన్ మ్యాన్ షో గా నడించిందని
సమాచారం. ఫస్టాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ డ్రామాతో నడిచే ఈ చిత్రం
సెకండాఫ్ కి వచ్చేసరికి సెంటిమెంట్
తో కూడిన యాక్షన్ తో
నడుస్తుంది. ఫస్టాఫ్ లో బ్రహ్మానందం,అలీ
కామెడీ,హీరోయిన్స్ తో చేసే రొమాన్స్
అదరకొడుతోందని టాక్.
అలాగే
సినిమా ప్ర్రారంభంలో వచ్చే ట్విస్టు ప్రేక్షకులను
కట్టిపాడేస్తోందని చెప్తున్నారు. ఇంటర్వెల్ సీన్ కి అయితే
లేచి ప్యాన్స్ విజిల్స్ వేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ప్లాష్
బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణమై నిలుస్తుందని,అది పడితే సినిమా
ఓ రేంజిలో ఆడుతుందని అంటున్నారు. దాదాపు ఇరవై నిముషాలు పాటు
జరిగే ఈ ప్లాష్ బ్యాక్
లో బాలకృష్ణ ముసలి గెటప్ లో
తన తండ్రి ఎన్టీఆర్ తలపించాడని అంటున్నారు. ఈ పాత్రే పీక్స్
కి వెళ్లిందని అంటున్నారు. ఇక యువకడుగా చేసే
బాలకృష్ణ పాత్ర పూర్తి మాస్
కు పడుతుందని,లక్ష్మి రాయ్,సలోని ఒళ్లు
దాచుకోకుండా కష్టపడ్డారని టాక్ వచ్చింది.
సినిమా
ఎక్కడా బోర్ కొట్టకుండా సాగటం
ప్లస్ అంటున్నారు. కంప్లీట్ గా ఫన్,రొమాన్స్
యాక్షన్ మిక్స్ చేసిన మసాలా గా
ఈ చిత్రాన్ని అభిమానులు అభివర్ణిస్తున్నారు. చాలా కాలం తర్వాత
వచ్చిన పూర్తి కథా చిత్రం అని
అంటున్నారు. అలాగే బాలయ్య కొన్ని
సీన్స్ లో ముఖ్యంగా ఒక
సీన్ లో బాలకృష్ణ సంతకం
పెట్టాల్సి పంపాల్సిన చోట డైలాగు రాసి
పంపటం వంటివి కేక పుట్టిస్తున్నాయని చెప్పుతున్నారు.
మూడు
పాత్రలూ శివుడి చేతిలో త్రిశూలంలా పదునుగా సాగిన ఈ చిత్రం
కథలో హరిశ్చంద్రప్రసాద్ (బాలకృష్ణ) ప్రజల కోసం పోరాడే
మనిషి. ప్రజల తలలో నాలుకగా
మసులుతూ సిసలైన నాయకుడిగా ఎదుగుతాడు. ఆయన ఆశయాల్ని కాపాడే
బాధ్యత తనయుడు రామకృష్ణ ప్రసాద్ (బాలకృష్ణ)పై పడుతుంది. ఆయన
కొడుకు బాబి (బాలకృష్ణ). తాతయ్య,
తండ్రి ఏ ఆశయాల కోసం
బతికారో, ఏ లక్ష్యం కోసం
తమ జీవితాన్ని పణంగా పెట్టారో తెలుసుకొని
అదే మార్గంలో పయనిస్తాడు. ఈ ప్రయాణంలో బాబికి
ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెరపైనే చూడాలి.
0 comments:
Post a Comment