హైదరాబాద్:
సిబిఐ ద్వారా సాక్షి మీడియా గొంతు నొక్కి తమ
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను
దెబ్బ తీయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ప్రయత్నిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు.
కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు దురదృష్టకరమని ఆయన గురువారం మీడియా
ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అంతిమంగా ధర్మం, న్యాయం గెలుస్తుందని ఆయన అన్నారు.
సాక్షి
మీడియాకు ప్రకటనలు నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో
అమలుపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని ఆయన
స్వాగతించారు. జగన్పై ఎన్ని
కుట్రలు చేసినా చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. న్యాయపోరాటం
చేయడానికి వెనకాడబోమని ఆయన అన్నారు. సాక్షి
మీడియాపై ఎల్లో మీడియా చేస్తున్న
అసత్య ప్రచారాలను నమ్మకూడదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి
చేశారు.
ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా
రాదని సర్వేలో తేలడంతో కాంగ్రెసు నేతలు పిచ్చి చేష్టలకు
పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్
రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.
సాక్షి
ఉద్యోగుల డిమాండ్లపై తమ స్టీరింగ్ కమిటీ
సమావేశంలో చర్చిస్తామని, వారు చేస్తున్న పోరాటానికి
తమ మద్దతు ఉంటుందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్
అన్నారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉద్యోగుల
భద్రతపై ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన బాధ్యత
ఉందని ఆయన అన్నారు. మీడియాపై
రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడడం
సరి కాదని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment