బజాజ్
ఆటో అందిస్తున్న డిస్కవర్ బ్రాండ్లో ఓ సరికొత్త
వేరియంట్ను నేడు మార్కెట్లో
ఆవిష్కరించింది. ఆకర్షనీయమైన డిజైన్, సరికొత్త లుక్, 125సీసీ బైక్ సెగ్మెంట్లో
మరే బైక్లో లేని
విశిష్టమైన ఫీచర్లతో కంపెనీ ఈ కొత్త బైక్ను రూపొందించింది. "డిస్కవర్ 125 ఎస్టి" (స్పోర్ట్స్ టూరర్) అనే కొత్త పేరుతో
ఈ బైక్ మార్కెట్లోకి వచ్చింది.
ఇందులో, ఈ విభాగంలోనే మొదటిసారిగా
డిటిఎస్-ట్విన్ స్పార్క్ టెక్నాలజీ కలిగిన ఇంజన్ను ఉపయోగించారు.
ఈ శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 13 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి
చేస్తుంది. పవర్తో పాటు
మైలేజ్ విషయంలో ఎలాంటి రాజీపడకుండా ఉండే విధంగా కొత్త
డిస్కవర్ 125 ఎస్టిని రూపొందించామని
బజాజ్ ఆటో పేర్కొంది.
స్పోర్టీ
లుక్నిచ్చే కొత్త డిస్కవర్ 125 ఎస్టిలో 5-స్పీడ్ గేర్ బాక్స్, రీడిజైన్
చేయబడిన ఫ్యూయెల్ ట్యాంక్, షార్ప్ ఎడ్జ్లు కలిగిన
పవర్ఫుల్ హెడ్ల్యాంప్,
స్టయిలిష్ అల్లాయ్ వీల్స్, మోనోషాక్ సస్పెన్షన్, ఎలాంటి రోడ్లపై అయినా సౌకర్యవంతంగా ప్రయాణించేలా
రూపొందించిన యాంటీ వైబ్రేషన్ ఫ్రేమ్,
మరింత సురక్షితమైన బ్రేకింగ్ కోసం అమర్చిన పెటల్
డిస్క్ బ్రేక్ వంటి మార్పులను గమనించవచ్చు.
దేశపు
ద్వితీయ అగ్రగామి కంపెనీ బజాజ్ ఆటో నేడు
మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సరికొత్త డిస్కవర్ 125 ఎస్టి (స్పోర్ట్స్
టూరర్)లో విశిష్టమైన ఫీచర్లు
ఉన్నాయి. ఈ బైక్ను
పూర్తిగా ఓ సరికొత్త ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా కంపెనీ
అభివృద్ధి చేసింది.
కొత్త
డిస్కవర్లో లభించే ఫీచర్ల
వివరాలు ఇలా ఉన్నాయి:
బజాజ్
డిస్కవర్ 125 ఎస్టి ఫీచర్లు:
* కొత్త
హెడ్ల్యాంప్
* సరికొత్త
ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ డిజైన్
* రీడిజైన్
చేయబడిన 10 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్
* కొత్త
అల్లాయ్ వీల్స్
* వెనుకవైపు
మోనోషాక్ సస్పెన్షన్
* సరికొత్త
సైడ్ ప్యానెల్స్
* కొత్త
గ్రాబ్‌రైల్
* కొత్త
సీట్
* కొత్త
మడ్గార్డ్
* సరికొత్త
సైలెన్సర్
బజాజ్
డిస్కవర్ 125 ఎస్టి స్పెసిఫికేషన్లు:
* ఇంజన్:
4 వాల్వ్ ట్విన్ స్పార్క్, ఎయిర్ కూల్డ్
* డిస్ప్లేస్మెంట్: 124.6సీసీ
* గరిష్ట
శక్తి: 13 పిఎస్ @ 9000 ఆర్పిఎమ్
* గరిష్ట
టార్క్: 1.1 కెజిఎమ్ @ 7000 ఆర్పిఎమ్
* ఇగ్నిషన్
సిస్టమ్: డిజిటల్ సిడిఐ
* కార్బురేటర్:
సివి టైప్
* స్టార్టింగ్
టైప్: సెల్ఫ్ + కిక్ స్టార్ట్
* ట్రాన్సిమిషన్:
5 స్పీడ్ కాన్స్టాంట్ మెష్
* ఫ్రేమ్:
సెమీ డబుల్ క్రాడెల్
* ఫ్రంట్
సస్పెన్షన్: టెలిస్కోపిక్ ఫోర్క్
* రియర్
సస్పెన్షన్: నైట్రాక్స్ మోనోషాక్ విత్ గ్యాక్ క్యానిస్టర్
* ఫ్రంట్
బ్రేక్: 200 మి.మీ. డయా
పెటల్ డిస్క్
* రియర్
బ్రేక్: 130 మి.మీ. డయా
డ్రమ్ బ్రేక్
* ఫ్రంట్
వీల్ / టైర్: అల్లాయ్ వీల్
/ 2.75 X 17” 41పి
* రియర్
వీల్ / టైర్: అల్లాయ్ వీల్
/ 3.00 X 17” 50పి
* ఫ్యూయెల్
ట్యాంక్: 10 లీటర్లు
* వీల్బేస్: 1305 మి.మీ.
* సీట్
ఎత్తు: 800 మి.మీ.
* టర్నింగ్
రేడియస్ : 2100 మి.మీ.
* గ్రౌండ్
క్లియరెన్స్: 170 మి.మీ.
* బరువు:
124.5 కేజీలు
* గరిష్ట
వేగం: గంటకు 105 కి.మీ.
* బ్యాటరీ:
12వోల్ట్ 5ఆంప్స్
కొత్త
డిస్కవర్ 125 ఎస్టి వచ్చే
నెల చివరి భాగం నాటికి
మార్కెట్లలో వాణిజ్య పరంగా లభ్యం కానుంది.
అయితే, దీని ధర విషయాన్ని
మాత్రం బజాజ్ ఆటో వెల్లడించలేదు.
0 comments:
Post a Comment