అతి తక్కువ బడ్జెట్లో, పూర్తిగా కొత్త
నటీనటులతో ‘ఈ రోజుల్లో’ లాంటి సూపర్ హిట్
చిత్రాన్ని నిర్మించిన దర్శకుడు మారుతి మరో సినిమాకు సిద్దం
అయ్యారు. ఈ చిత్రానికి‘బస్ స్టాప్’ అనే టైటిల్ ఖరారు
చేశారు.
‘బస్
స్టాప్’
చిత్రం ఈ రోజు ఉదయం
రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి
ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ముఖ్య
అతిథిగా హాజరయి కెమెరా స్విచాన్ చేశారు. యూత్ ఫుల్ ఎంటర్
టైనర్గా రూపొందుతున్న ఈచిత్రాన్ని
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్... సాయి గణేష్ ప్రొడక్షన్స్
బేనర్పై నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ...నేను రాసిన స్ర్కిప్టును
నమ్మి ఈ రోజుల్లో సినిమా
తీశాను. పెద్ద హిట్ అయి
మా టీమ్ అందరికీ మంచి
పేరు వచ్చింది. బస్ స్టాప్ కథను
సంవత్సరం నుంచి తయారు చేస్తున్నాను.
ఈ సబ్జెక్టు తెరమీదకు తేవడానికి ఈ రోజుల్లో ఓ
డెమో మాత్రమే. నా మొదటి సినిమా
కన్నా ఫుల్ ఎంటర్టైన్మెంట్ను ఈ
సినిమా అందించనుంది. ‘నీకు నాకు’ టీం సినిమా హీరో
హీరోయిన్ల నందిత, ప్రిన్స్ నా కథకు ఏప్ట్
అవుతారు అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా : ప్రభాకర్ రెడ్డి, మ్యూజిక్ : జెవి, అనీల్, ఎడిటర్
: ఉదయ్, దర్శకుడు : దాసరి
మారుతి
మారుతి
ఇది వరకు దర్శకత్వం వహించిన
‘ఈ రోజుల్లో’ చిత్రం విజయవంతంగా ఈ రోజుతో 50 రోజులు
పూర్తి చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ రోజుల్లో చిత్రం
ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించి తెలుగు
సినిమా పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
0 comments:
Post a Comment