హైదరాబాద్:
తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ అధ్యక్షుడు
నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి మరో లేఖ ఇస్తారని
తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి
దయాకర్ రావు అన్నారు. తెలుగుదేశం
తెలంగాణ ఫోరం విస్తృత స్థాయి
సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన
మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై గతంలో తమ పార్టీ
చేసిన తీర్మానానికి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు.
పార్టీ
తీర్మానం మేరకు కేంద్రానికి గతంలో
లేఖ ఇచ్చామని, అవసరమైతే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాస్తారని ఆయన
చెప్పారు. ఉప ఎన్నికల తర్వాత
కేంద్రానికి మరో మారు చంద్రబాబుతో
లేఖ ఇప్పిస్తామని ఆయన చెప్పారు. ఉప
ఎన్నికల తర్వాత చంద్రబాబు తమ పార్టీకి చెందిన
కోస్తా, రాయలసీమ నాయకులతో మాట్లాడి తెలంగాణపై మరింత స్పష్టత ఇస్తారని
ఆయన చెప్పారు,
తెలంగాణ
ఇస్తే అభ్యంతరం లేదని కొంత మంది
సీమాంధ్ర నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ
మహానాడులో తెలంగాణపై చర్చిస్తామని ఆయన చెప్పారు. 2014లో
తాము అధికారంలోకి వస్తే శాసనసభలో తొలి
తీర్మానం తెలంగాణపైనే పెడతామని ఆయన చెప్పారు. వరంగల్
జిల్లా పరకాల ఉప ఎన్నికలో
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని బహిష్కరిస్తే
తాము తెలంగాణ రాజకీయ జెఎసికి సహకరిస్తామని ఆయన చెప్ాపరు
పరకాల
ఉప ఎన్నిక పేరుతో తెరాస అధ్యక్షుడు కె.
చంద్రశేఖర రావు కోట్లు వసూలు
చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పరకాలలో
తెరాస, బిజెపిలకు పట్టు లేదని ఆయన
అన్నారు. పరకాలలో తమ పార్టీ అభ్యర్థి
గెలిచి తీరుతాడని ఆయన దీమా వ్యక్తం
చేశారు. తెలంగాణ రాజకీయ జెఎసిని కెసిఆర్ మోసం చేస్తున్నారని ఆయన
విమర్శించారు. తెరాసకు బుద్ధి చెప్పడానికి పరకాల ప్రజలు సిద్ధంగా
ఉన్నారని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment