నాగార్జున,
అనుష్క కాంబినేషన్ లో శ్రీనివాస రెడ్డి
రూపొందిస్తున్న ఢమరకం చిత్రం త్వరలో
విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ
నేపధ్యంలో ఓ విచిత్రమైన వివాదం
తెరమీదకు వచ్చింది. ఢమరకం టైటిల్ తమదేనని,
తామే ముందు రిజిస్టర్ చేసుకున్నామని
కోర్టుకి వెళ్లి మరీ ఓ దర్శక,
నిర్మాతలు ఆ టైటిల్ ని
తమ సినిమాకు ఖరారు చేసుకున్నారు. ఆ
వివరాల్లోకి వెళితే..
యువ దర్శక నిర్మాతలు..ప్రమోద్
కుమార్ గౌడ్,మనోజ్ కుమార్
లు సామాజిక సమస్యల నేపధ్యంలో ఓ చిత్రం తియ్యాలని
ప్లాన్ చేసారు. ఆర్నవ్ మూవీ బ్యానర్ సమర్పణలో
ఢమరుకం అనే టైటిల్ ని
రిజిస్టర్ చేయించారు. ఈ టైటిల్ కి
డేంజరస్ వెపన్ అనే ట్యాగ్
లైన్ కూడా పెట్టారు. ఎ.పి. ఫిల్మ్ ఛాంబర్
లో 22, పిబ్రవరి 2008లో ఈ టైటిల్
రిజిస్టర్ అయ్యింది. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయలేకపోయిన ఈ దర్శక, నిర్మాతలు
మళ్లీ వెయ్యి రూపాయలు ఫీజు చెల్లింది 25, పిబ్రవరి
2010 వరకూ టైటిల్ గడవును పొడిగించుకున్నారు. యాభై శాతం వరకూ
సినిమా షూటింగ్ పూర్తైంది.
ఇంతలో
2009లో సినీ కార్మికుల సమ్మెతో
షూటింగ్ నిలిచిపోయింది. ఈలోగా దర్శకుడు నవీన్
కళ్యాణ్ కి యాక్సిడెంట్ కావటంతో
ఆరు నెలలు పాటు షూటింగ్
ఆగిపోయింది. షూటింగ్ అంతరాయం జరిగిన విషయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కి వివరించారు దర్శక,
నిర్మాతలు. 2011లో షూటింగ్ జరుగుతుండగా
ఓ వార్త విని షాట్
అయ్యారు. ఆర్.ఆర్.మూవీ
మేకర్స్ కూడా ఇదే టైటిల్
రిజిస్టర్ చేయించుకుందని అందుకే డబ్బు ఇవ్వటం ఆపేస్తున్నామని
ఫైనాన్సియర్స్ తెలిపారు. అప్పుడు ఫిల్మ్ ఛాంబర్ కి ఎన్ని సార్లు
వెళ్లినా కూడా సరైన రెస్పాన్స్
రాలేదు.
ఆర్నవ్
మూవీస్ పతాకంపై తీస్తున్న ఈ చిత్రం సగానికి
పైగా పూర్తి చేసుకుని జూన్ లో రిలీజ్
కు రెడీ చేద్దామనుకున్నారు. అడియా రిలీజ్
కు కూడా ప్లాన్ చేసుకున్నామంటున్నారు.
ఫైనాన్సియర్స్ వెళ్లిపోవటంతో టోటల్ గా నష్టపోయామంటున్నారు.
ఎక్కడా న్యాయం జరగకపోవటంతో చివరకు కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే ఆర్.ఆర్.మూవీ మేకర్స్ తీస్తున్న
ఢమురకం చిత్రం టైటిల్ ఇంగ్లీష్ అక్షరాలకి, వీరు తీస్తున్న టైటిల్
అక్షరాలుకి తేడా ఉండటం వల్ల
ఇబ్బందేమీ లేదని కోర్టు తీర్పు
ఇచ్చింది.
ఆర్.ఆర్.వాళ్ళు వేసిన
కౌంటర్ కి... Dhamarukam అనే అక్షరాలు తమ
సినిమావని, అదే ఆర్నవ్ మూవీ
బ్యానర్ వాళ్లది అయితే Damarukam అని రెండింటిలోనూ అక్షరం
తేడా ఉండటం వల్ల ఇద్దరూ
ఇదే టైటిల్ తో సినిమా తీసుకోవచ్చనే
తీర్పు వచ్చింది. ఎపి ఫిల్మ్ ఛాంబర్
వాళ్లు ఈ విషయమై మాట్లాడుతూ...ఆర్.ఆర్.మూవీ
మేకర్స్ వాళ్లు వచ్చి వాళ్లు తమకు
ఢమరకటం టైటిల్ కావాలని చెప్పారు. సిస్టంలో చూసాం. అక్కడ లాప్స్ అయిపోయిందని
సిస్టం చూపటంతో ఆర్.ఆర్ వాళ్లకి
ఈ టైటిల్ ఇచ్చామని చెప్పారు. దాంతో ఇప్పుడు ఢమరకం
టైటిల్ తో రెండు సినిమాలు
విడుదల అవుతున్నాయి. తమ సినిమా అని
అన్నారు.
0 comments:
Post a Comment