మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్
హీరోగా వంశీ పైడి పల్లి
దర్శకత్వంలో ‘ఎవడు’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం
ఈ చిత్రం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది.
విశ్వసనీయంగా యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం
ప్రకారం షూటింగ్ కోసం వేసిన సెట్లో
చిన్న అగ్ని ప్రమాదం చోటు
చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే యూనిట్ సభ్యులంతా
వెంటనే తేరుకుని మంటలను ఆర్పారు. అదృష్ట వశాత్తు ఎవరికీ ఎలాంటి హాని కలుగలేదు. ఈ
సంఘటన కారణంగా ఒక రోజు షూటింగ్
వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
వంశీ
పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో రామ్ చరణ్ సరసన
సమంత, అమీజాక్సన్ రొమాన్స్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ
వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్పై ఈ
చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్
చరణ్ పాత్ర డిఫెరెంట్ గా
ఉండనుంది. గుడిని మింగేవాడుంటే, ఆ గుడిలోని లింగాన్ని
కూడా స్వాహా చేసేవాడు ఒకడుంటాడు. ఒక బంతికి ఆరు
పరుగులు కొడితే, ఏడో పరుగుకీ దౌడు
తీసేవాడొకడు వస్తాడు. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడూ
ఉంటాడు. అలాంటివాడే రామ్చరణ్.
దర్శకుడు
చిత్రం గురించి మాట్లాడుతూ..''రామ్చరణ్ని
ఓ విభిన్నశైలిలో ఆవిష్కరించే చిత్రమిది. మాస్ అంశాలు పుష్కలంగా
ఉంటాయి. ఈ కథలో ప్రతి
పాత్ర కీలకమే. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అలరిస్తాయని''అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చరణ్, అమీలపై
పబ్ నేపథ్యంలో సాగే ఓ గీతాన్ని
తెరకెక్కిస్తున్నారు. శోభి నృత్యరీతులు సమకూర్చారు.
ఈ చిత్రంలో సమంత ని లీడ్
హీరోయిన్ గా ఎంపిక చేశారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ
చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
0 comments:
Post a Comment