పవర్
స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్
టైగర్ జూ ఎన్టీఆర్ సినిమాలు
ఒకే రోజు విడుదలవుతున్నాయి. పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో
నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ఈ
నెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్,
తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలు,
ఓవర్సీస్లో గ్రాండ్గా
విడుదలవుతోంది.
జూనియర్
ఎన్టీఆర్ నటించిన ‘దమ్ము’ చిత్రం తమిళ వెర్షన్ ‘సింగమగన్’ కూడా
మే 11వ తేదీన తమిళనాడులో
విడుదలవుతోంది. అంటే తమిళనాడులో గబ్బర్
సింగ్, దమ్ము చిత్రాలు ఒకే
రోజు ఢీకొట్టుకోబోతున్నాయన్నమాట. ఈ నేపథ్యంలో ఈ
రెండు సినిమాల్లో ఏ సినిమాది పైచేయి
అవుతుంది అనే విషయం చర్చనీయాంశం
అయింది.
దమ్ము
చిత్రం ఏప్రిల్ 27న తెలుగులో విడుదలై
తొలి వారంలో దాదాపు 31 కోట్ల వసూళ్లను సాధించింది.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక,
త్రిష జూనియర్కు జంటగా నటించారు.
కెఎస్ రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ
ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ బేనర్పై రూపొందించారు.
గబ్బర్
సింగ్ చిత్రంలో...పవన్ కళ్యాణ్ సరసన
శృతి హాసన్ నటిస్తుండగా.. మలైకా
అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని,
బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు,
రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్,
ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్,
మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల
ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటో
గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం
: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం
రాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న
సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్
కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ
: శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీప్లే,
మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్
0 comments:
Post a Comment