హైదరాబాద్:
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
తీరు పట్ల వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు తీవ్ర అసంతృప్తితో
ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ తనను
గుర్తించకపోవడంతో ఆయన అసంతృప్తికి గురైనట్లు
చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలోని తన స్వగ్రామంలో చేసిన
ప్రకటనకు జగన్ తనను ఆహ్వానించకపోవడం
అసంతృప్తికి ప్రధాన కారణమని అంటున్నారు.
ప్రకాశం
జిల్లా ఇంచార్జీగా తనను నియమించకపోవడంపై జూపూడి
ప్రభాకర రావు అసంతృప్తితో ఉన్నట్లు
చెబుతున్నారు. జగన్ వ్యవహార శైలి
జూపూడి ప్రభాకర రావును బాధపెట్టిందని చెబుతున్నారు. నాయకులను పట్టించుకోని జగన్ తీరు ఆయన
నచ్చలేదని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రభుత్వ హయాంలో జూపూడి ప్రభాకర రావు ఎమ్మెల్సీ అయ్యారు.
వైయస్
రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జూపూడి
ప్రభాకర రావు వైయస్ జగన్
వెంట ఉన్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా కూడా నియమితులయ్యారు. వైయస్
జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలోనూ ఆయన
సమర్థించుకుంటూ వస్తున్నారు. ఒక రకంగా చూస్తే
జూపూడి ప్రభాకర రావుకు పార్టీలో మంచి స్థానమే కల్పించినట్లు
చెబుతారు.
గతంలో
అంబటి రాంబాబు కూడా కొంత కాలం
వైయస్ జగన్పై అలక
వహించారు. తనను కేవలం అధికార
ప్రతినిధిగా మాత్రమే నియమించడంపై ఆయన అప్పట్లో అలక
వహించినట్లు చెప్పారు. దానికితోడు, అంబటి రాంబాబు తీరు
పట్ల వైయస్ జగన్ అప్పట్లో
అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతారు. మొదటి నుంచీ జగన్
వెంట నడుస్తున్న ముఖ్యమైన నాయకుల్లో వీరిద్దరూ ఉన్నారు.
0 comments:
Post a Comment