ఢీ, రెడీ, కింగ్, అదుర్స్,
డాన్ శీను, దూకుడు లాంటి
సూపర్ హిట్ చిత్రాలకు స్క్రిప్టు
రైటర్గా పని చేసిన
ప్రముఖ రచయిత కోన వెంకట్
త్వరలో నటుడిగా వెండి తెరకు పరిచయం
కాబోతున్నాడు. రామ్, తమన్నా హీరో
హీరోయిన్లుగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎందుకంటే ప్రేమంట చిత్రం ద్వారా ఆయన తెరంగ్రేటం చేయనున్నట్లు
తెలుస్తోంది.
ఈ చిత్రంలో కోన వెంకట్ నెగెటివ్
రోల్లో కనిపింబచోతున్నాడని సమాచారం. అయితే
ఈ చిత్రంలో కోన వెంకట్ పోషిస్తున్న
పాత్ర ఏమిటి? అనే విషయం మాత్రం
ఇప్పటి వరకు బయటకు పొక్కలేదు.
ఈ చిత్రంలో హీరో రామ్కి
వ్యతిరేకంగా ఆయన పాత్ర ఉంటుందని
అంటున్నారు.
ఎందుకంటే
ప్రేమంట చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్...స్రవంతి
మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ
నెలలోనే ఈ చిత్రం విడుదల
కాబోతోంది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం
అందించారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం
ఆడియోకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్
వస్తోంది.
యువతరాన్ని
వెంటాడే ప్రేమ కథగా ఈ
చిత్రం రూపొందుతోంది. కరుణాకరన్ కలర్ఫుల్గా
చిత్రీకరిస్తున్నారు. జెనీవా స్విట్జర్లాండ్లలో షూట్ చేసిన
పాటలు హైలెట్గా ఉంటాయని అంటున్నారు.
రాధికా ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్శెట్టి తదితరులు
నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:
జి.వి.ప్రకాష్కుమార్,
నిర్మాత: పి.రవికిషోర్, కథ,
స్క్రీన్ప్లే, దర్శకత్వం: కరుణాకరన్
0 comments:
Post a Comment