దశాబ్ధాల
కాలంగా చిన్న కార్ సెగ్మెంట్లో
కీలక పాత్ర పోషించిన 'మారుతి
ఎమ్800' కారును ప్రస్తుతం కాలుష్య నిబంధనల దృష్ట్యా, దీని అమ్మకాలను వివిధ
ప్రాంతాల్లో నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే,
అత్యధికంగా అమ్మకాలు జరుగుతున్న తక్కువ ధర కలిగిన చిన్న
కార్ల విభాగంలో (లో-కాస్ట్ స్మాల్
కార్ సెగ్మెంట్)ని అవకాశాలను కోల్పోవడం
ఇష్టం లేని మారుతి సుజుకి,
ఎమ్800 కారును భర్తీ చేసేలా మరో
బుజ్జి కారును భారతీయ వినియోగదారులకు పరిచయం చేయనుంది.
మధ్యతరగతి
ప్రజలను టార్గెట్ చేస్తూ అభివృద్ధి చేసిన ఈ చవక
కారును వచ్చే దీపావళి నాటికి
మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. అధిక మైలేజ్ని
ఇచ్చేందుకు మారుతి సుజుకి సెర్వో కారులో 660సీసీ ఇంజన్ను
ఉపయోగించారు. సెర్వో కారును కేవలం రూ.2 లక్షల
నుండి రూ.2.25 లక్షల ధరల శ్రేణిలో
అందుబాటులో ఉంచాలని మారుతి సుజుకి ప్రయత్నిస్తోంది.
టాటా
మోటార్స్ అందిస్తున్న చవక కారు టాటా
నానో కు మారుతి సుజుకి
సెర్వో గట్టి పోటీ ఇవ్వగలదని
మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మారుతి సుజుకి సెర్వోలో ఉపయోగించిన 660సీసీ ఇంజన్ 54 బిహెచ్పిల శక్తిని విడుదల
చేయనుంది (టాటా నానాలో ఉపయోగించిన
624సీసీ ఇంజన్ కేవలం 38 బిహెచ్పిల శక్తిని మాత్రమే
విడుదల చేస్తుంది). భారతీయుల అభిరుచలకు అనుగుణంగా మారుతి సుజుకి ఈ చిన్న కారును
అభివృద్ధి చేస్తుంది. ఇది ఖచ్ఛితంగా మారుతి
ఎమ్800 మోడల్ కన్నా ఎన్నో
రెట్లు మెరుగ్గానూ, స్టయిలిష్గానూ ఉండనుంది.
0 comments:
Post a Comment