హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల
కేసులో అరెస్టయిన మంత్రి మోపిదేవి వెంకటరమణ తన సన్నిహితుల వద్ద
కంటతడి పెట్టారు. తన చేత కొన్ని
ఫైళ్ల మీద బలవంతంగా సంతకాలు
పెట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం
చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన ఓ అధికారి వల్లనే
కొంప మునిగిందని ఆయన తన సన్నిహితుల
వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు
వార్తలు వచ్చాయి.
తాను
కొన్ని ఫైళ్లను తిరస్కరించినా అధికారి తన వద్దకు వచ్చి
బలవంతంగా సంతకాలు పెట్టించుకుని వెళ్లారని ఆయన అన్నట్లు చెబుతున్నారు.
తనకు తెలిసి ఏ తప్పూ చేయలేదని
మోపిదేవి వెంకటరమణ తన రాజీనామా లేఖలో
స్పష్టం చేశారు. అన్యాయంగా తనను కేసులో ఇరికించారని
ఆయన అన్నారు. కేసులో తనను ఇరికించడం బాధాకరంగా
ఉందని ఆయన అన్నారు. బలహీనవర్గాలకు
చెందినవాడిని కాబట్టే తనను కేసులో ఇరికించారని
ఆయన అన్నారు.
సిబిఐకి
తాను అన్ని విధాలా సహకరిస్తానని,
తనకు తెలిసిన అన్ని విషయాలూ చెబుతానని
ఆయన అన్నారు. జీవోలను, నోట్ ఫైళ్లను అన్నింటినీ
పరిశీలిస్తే తాను తప్పు చేయలేదని
తెలుస్తుందని, కొన్ని ఫైళ్లను మాత్రమే పరిశీలించారని ఆయన అన్నారు. నోట్
ఫైళ్లను పరిశీలిస్తే తాను తప్పు చేయలేదని
తెలుస్తుందని ఆయన అన్నారు. కార్యదర్శుల
సమక్షంలోనే తాను సంతకాలు చేశానని
ఆయన అన్నారు. నాయకుడి ఆదేశాలు పాటించాలి కాబట్టి వైయస్ హయాంలో సంతకాలు
చేశానని ఆయన అన్నారు. కొన్ని
సందర్భాల్లో తనను పిలిపించుకుని సంతకాలు
పెట్టించుకున్నారని ఆయన అన్నారు. అయితే
రాజీనామా లేఖలో ఆయన ఎవరి
పేరు కూడా ప్రస్తావించకుండా పరోక్షంగా
విషయాలను చెప్పారు.
పార్టీ
కోసం తాను కష్టపడి చేశానని
ఆయన చెప్పారు. ఏనాడూ తాను పార్టీకి
వ్యతిరేకంగా పనిచేయలేదని ఆయన అన్నారు. తన
పదవిని ఏరోజు కూడా దుర్వినియోగం
చేయలేదని ఆయన అన్నారు. ఉప
ఎన్నికల్లో తాను కాంగ్రెసు పార్టీ
విజయం కోసం పనిచేస్తున్నానని, మత్స్యకారుల
ఓట్ల కోసం తాను నెల
రోజులుగా పనిచేస్తున్నానని ఆయన చెప్పారు. తాను
తన నిజాయితీనీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని, అలా నిరూపించుకుని తిరిగి
మంత్రి వర్గంలో చేరగలననే నమ్మకం తనకు ఉందని ఆయన
అన్నారు.
0 comments:
Post a Comment