హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీ
నేత మైసూరా రెడ్డి వచ్చారు. ఈ రోజు జగన్
సిబిఐ విచారణకు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ
నేపథ్యంలో మైసూరా ఆయన ఇంటికి రావడం
చర్చనీయాంశమైంది. జగన్ అరెస్టవుతారన్న ప్రచారం
నేపథ్యంలో మైసూరా రెడ్డికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే
అవకాశముందని తెలుస్తోంది.
మైసూరా
రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయనకు రెండోసారి టిడిపి
అధినేత నారా చంద్రబాబు నాయుడు
రాజ్యసభ పదవి ఇవ్వకపోవడంతో ఆయన
తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన గత
కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన జగన్ పార్టీలో
చేరేనున్నారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది.
ఈ నేపథ్యంలో జగన్ను సిబిఐ
విచారణకు పిలవడం, అతనిని కలిసేందుకు మైసూరా రెడ్డి రావడం చర్చనీయాంశమైంది. మైసూరా
రెడ్డి జగన్తో అల్పాహార
విందులో పాల్గొన్నారు.
కాగా
సిబిఐ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో జగన్ ఇంటికి వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నేతలు బారులు తీరారు.
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, భూమా నాగి రెడ్డి,
అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, బాజిరెడ్డి
గోవర్ధన్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు
జగన్ ఇంటికి వచ్చారు. జగన్ తన సన్నిహితులు
వైవి సుబ్బా రెడ్డి, విజయ సాయి రెడ్డిలతో
ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఒకవేళ
తాను అరెస్టు అయితే ఎవరికి ఏఏ
బాధ్యతలు అప్పగించాలో మైసూరా రెడ్డి, విజయ సాయి రెడ్డి,
సుబ్బారెడ్డితో జగన్ చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు. జగన్
పైన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు.
జగన్ను అరెస్టు చేస్తే
తాను ఆమరణ నిరాహార దీక్షకు
దిగుతాని పశ్చిమ గోదావరి జిల్లాలో హరిరామజోగయ్య హెచ్చరించారు.
కాగా
జగన్ను మైసూరా రెడ్డి
కలవడంపై తెలుగుదేశం పార్టీ వెంటనే స్పందించింది. ఆయనను పార్టీ నుండి
సస్పెండ్ చేసింది. జగన్ నివాసానికి వెళ్లి
కలవడాన్ని క్రమశిక్షణ ఉల్లంఘన కింద భావించిన పార్టీ
ఆయనను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా మైసూరా రెడ్డిన
తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలలో భవిష్యత్తులో ఒక్క నేత కూడా
మిగలరని అన్నారు.
0 comments:
Post a Comment