జూనియర్
ఎన్టీఆర్ వారసత్వ పోరు నేపథ్యంలో రాజకీయంగా
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి
తనయుడు నారా లోకేష్ వెనకంజ
వేసినట్లు అందరూ భావిస్తున్నారు. కానీ,
నారా లోకేష్ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల విషయంలో
ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు
తెలుస్తోంది. తండ్రి చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికల ప్రచారంలో
తీరిక లేకుండా తిరుగుతుంటే, తెర వెనక పని
అంతా నారా లోకేష్ చేస్తున్నాడట.
రాష్ట్రంలోని
18 శాసనసభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి
జూన్ 12వ తేదీన ఉప
ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికలను
చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ముమ్మరంగా ప్రచారం
సాగిస్తున్నారు. ఎండను లెక్క చేయకుండా
ఆయన తిరుగుతున్నారు. ఈ స్థితిలో తెర
వెనక పనులను నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నట్లు
సమాచారం.
ఉప ఎన్నికల పర్యవేక్షణకు చంద్రబాబు పార్టీ నాయకుడు దాడి వీరభద్ర రావు
నేతృత్వంలో ఓ మానిటరింగ్ కమిటీని
వేశారు. ఉప ఎన్నికలు జరుగుతున్న
స్థానాల నుంచి సమాచారాన్ని తెప్పించుకోవడం,
దాన్ని విశ్లేషించి స్థానిక నాయకులకు ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు ఇవ్వడం ఈ మోనటరింగ్ కమిటీ
పని. ఈ పని పైకి
వీరభద్ర రావు నేతృత్వంలో జరుగుతున్నట్లు
కనిపిస్తున్నాయి.
ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల నుంచి సమాచారమంతా నారా
లోకేష్కు చేరుతోందని, దాన్ని
ఆయన విశ్లేషించి లోపాలను సరిదిద్దేందుకు తగిన సూచనలు చేస్తున్నారని
అంటున్నారు. నారా లోకేష్ నేరుగా
స్థానిక నాయకులతో మాట్లాడుతూ అవసరమైన సలహాలు కూడా అందిస్తున్నారట. తెర
వెనక కీలక పాత్ర పోషిస్తున్న
నారా లోకేష్ తెర ముందుకు రావడానికి
అవసరమైన తతంగమంతా జరుగుతోందని అంటున్నారు.
0 comments:
Post a Comment