పవన్
కళ్యాణ్ పబ్లిసిటీ కి దూరంగా ఉండటానికి
కారణం వివరిస్తూ...నిజానికి నేను పబ్లిసిటీకి దూరంగా
ఉండాలని ఏమీ ప్లాన్ చేసుకోలేదు.
ఫస్ట్ ఫిల్మ్ లు అప్పుడు ఫోటోలు
వేయటానికి పెద్ద ఉత్సాహం చూపించేవారు
కాదు...నాకు ఎవరిని అడగటం
తెలియదు..ఎవరిని అడగాలి..ఏమిటి అనేది తెలియదు..
అడగటం నాకు ఇష్టం లేదు..
పబ్లిసిటీ లేకపోయినా సినిమాలు ఆడేసేవి.. పిలిచినా చిన్న కాలమ్ లో
వేసేవారు. నేను ఏమి నమ్ముతాను
అంటే...సినిమా బాగున్నప్పుడు ..కంటెట్ బాగున్నప్పుడు..అది ఎలాగో రీచ్
అవుతుంది. బాగోలేనప్పుడు మనం ఎన్ని చేసినా
కాని వృధా ప్రయాసే అనిపిస్తుంది
అని చెప్పారు.
అలాగే
ఎదురెళ్లి మరీ పబ్లిసిటీ చేయను.
నా పరిమితులు బట్టి చూసుకుంటాను. అది
నా నైజం కాదు అన్నారు.
అలాగే నేను ఎన్ని మాట్లాడినా..నా సినిమాలు కనెక్టు
అయితేనే నేను కనెక్టు అవుతాను...వాళ్లు పది రూపాయలు పెట్టుకుని
సినిమాకి వెళ్లినప్పుడు...నేను ఎంటర్టైన్ చేయగలుగుతన్నానా
అనేదే ముఖ్యం..నా పర్శనల్ లైఫ్
లో ఎలాంటి వ్యక్తిని అనేదానికన్నా..రియల్ లైఫ్ లో
ఏ స్ధాయి వ్యక్తిని అనే దాని కన్నా...నా పని ఏమిటి
వారిని ఎంటర్టన్ చేయటం ..నేను దానికే ఆసక్తి
చూపిస్తాను అన్నారు.
ఇక ఈ చిత్రం అభిమానలకు
విందు భోజనంలా మెప్పిస్తోంది. పవన్ చెప్పే పంచ్
డైలాగులకు ధియోటర్ లో కంటిన్యూ విజిల్స్
పడుతున్నాయి. ఫ్యాన్ కి పండుగ అనిపించే
ఈ చిత్రం ప్రీ క్లైమాక్స్ లో
వచ్చే కెవ్వు కేక పాట తో
మళ్లీ కిక్కు అందుకుని ఊహించని క్లైమాక్స్ తో సినిమా ముగియటం
బాగుందంటున్నారు. పవన్ పాటల్లో మళ్లీ
ఖుషీ నాటి ఉత్సాహం కనపడి
మురిపిస్తోంది. ఇది అవుట్ అండ్
అవుట్ పవన్ చిత్రం. పవన్
అవుట్ స్టాండిగ్ గా తన పాత్రలో
జీవించాడు. కామెడీ,పంచ్ డైలాగులు,తనదైన
శైలిలో స్టెప్స్ వేసి అలరిస్తున్నాడు. యాక్షన్
సీన్స్ లో అయితే విశ్వరూపం
చూపించాడని చెప్తున్నారు.
పరమేశ్వర
ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ
భారీ చిత్రాన్ని నిర్మించారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్,
కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు,
రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్,
ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్,
మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన
ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం:
దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.
0 comments:
Post a Comment