సూపర్
స్టార్ రజనీకాంత్ హీరోయిన్ దీపిక పడుకొనెతో కలిసి
క్లాసికల్ డాన్స్ స్టెప్పులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కొచ్చాడయాన్’ చిత్రం
షూటింగులో భాగంగా త్రివేండ్రం, కేరళలో ఇందుకు సంబంధించిన షూటింగు జరుగుతోంది.
హాలీవుడ్
మూవీ అవతార్ తరహాలో మోషన్ కాప్చర్ టెక్నాలజీతో
3డి ఫార్మాట్లో ....ఇండియాలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్తో
ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు కె.ఎస్. రవికుమార్
పర్యవేక్షణలో రజనీ చిన్న కుమార్తె
సౌందర్య డైరెక్ట్ చేస్తుండగా...ఎ.ఆర్. రెహమాన్
సంగీతం సమకూరుస్తున్నాడు.
రోబో
తర్వాత రజనీ ‘రాణా’ చిత్రాన్ని మొదలు పెట్టారు. ఆ
చిత్రం ప్రారంభోత్సవం రోజు ఆయన అనారోగ్యానికి
గురి కావడం సినిమా అటకెక్కింది.
చాలా రోజుల గ్యాప్ తర్వాత
రజనీ మళ్లీ తన కూతురు
సౌందర్య దర్శకత్వంలో ‘కొచ్చాడయాన్’
సినిమా చేస్తున్నారు.
ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో
కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని
సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి
ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందించనున్నారు. ఈచిత్రంలో
రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో
శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో
పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని,
అందుకే ‘ఖడ్గ రుద్ర’ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
0 comments:
Post a Comment